ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను డయాబెటిస్ వ్యాధి పట్టి పీడిస్తోంది.ఈ జబ్బు బారిన పడిన ప్రజలు బతికి ఉండగానే నరకం అనుభవిస్తున్నారు.
చెడు జీవన విధానం పాటించడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుగ్గా ఉండటం వలన ఈ చెక్కర వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
కానీ నేటి కాలంలో మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా అనేకమంది ప్రజలు డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు.అయితే కొందరిలో వంశపారంపర్యంగా కూడా డయాబెటిస్ వ్యాధి వస్తుంది.
ఈ వ్యాధి సోకిన వారికి గాయాలు త్వరగా మానవుపుండ్లు ఏర్పడిన డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి వర్ణనాతీతం.కొందరు వ్యాధిగ్రస్తులు పక్షవాతానికి గురవుతారు.ఇలాంటి భయంకరమైన వ్యాధి రాకుండా ఉండాలంటే రోజూ తీసుకునే ఆహార విషయంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.డయాబెటిస్ లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుడిని సంప్రదించటం కూడా చాలా ముఖ్యం.
అయితే డయాబెటిస్ వ్యాధి లక్షణాలు ఏమిటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
ప్రతిరోజు కంటినిండా నిద్రపోతూ తగినంత విశ్రాంతి తీసుకుంటున్నా సక్రమంగా ఆహారం తింటున్న కూడా తీవ్ర అలసటకు గురవటం డయాబెటిస్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం.ఎక్కువగా పని చేసినా పని చేయకపోయినా కూడా అలసటకు గురయ్యేవారు డాక్టర్ని సంప్రదించి హెల్త్ చెకప్ చేయించుకోవడం ముఖ్యం.ఈ వ్యాధుల బారిన పడితే త్వరగా డీహైడ్రేషన్ కి కూడా గురయ్యే అవకాశం ఉంది.
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లయితే కిడ్నీలు చక్కెర ను సక్రమంగా ఫిల్టర్ చేయలేవు.ఫలితంగా ఫిల్టర్ కాని చక్కెర అంతా కూడా మూత్రంలో పేరుకుపోతుంది.దీనివల్ల తరచుగా శరీరం నుంచి మూత్రం బయటకు వస్తుంది.అయితే సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్రం వస్తుంటే స్థానిక వైద్యున్ని సంప్రదించి అలా ఎందుకు జరుగుతుందో చెకప్ చేయించుకోవాలి.
రహస్యంగాలపై దురద పెట్టడం కూడా డయాబెటిస్ వ్యాధి లక్షణమే.అకస్మాత్తుగా బరువు తగ్గడం, కంటిచూపు మందగించడం మెడ, జాయింట్ల వద్ద చర్మం నల్లగా రంగు మారటం వంటి లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్ వ్యాధి బారిన పడినట్టు గుర్తించాలి.