ఐపిఎల్ మరో నాలుగు రోజుల్లో ముగిసిపోతుంది.ఈ లీగ్ కు డ్రీమ్11 పెద్ద మొత్తంలో స్పాన్సర్ గా ఉంటోంది.ప్రస్తుతం డ్రీమ్11కు గట్టి దెబ్బ తగిలింది.డ్రీమ్11 నిబంధనలు ఉల్లంఘించినట్లు బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.డ్రీమ్ 11 వ్యవస్థాపకులు అయినటువంటి హర్ష్ జైన్, భవిత్ సేథ్ లపై ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేసిట్లు తెలుస్తోంది.డ్రీమ్11 ప్రధాన కేంద్రం ముంబై నగరంలో ఉంది.ఈ ఫాంటసీ లీగ్స్ ను డ్రీమ్11 ముంబై నుంచే నడిపిస్తోంది.దేశంలో అన్ని రాష్ట్రాల్లో డ్రీమ్11 తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ఫాంటసీ లీగ్స్ నడిపించడంలో డ్రీమ్11 దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.గత సీజన్లో చైనాతో గొడవల వల్ల ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ అయిన వీవో తప్పుకుంది.దీంతో రూ.220 కోట్లతో డ్రీమ్ 11 టైటిల్ స్పాన్సర్ గా తన స్థాయిని నిలుపుకుంది.ఈ డ్రీమ్11లో మ్యాచ్ ప్రిడిక్షన్స్‌తో పాటు ఇతర ఫాంటసీ గేమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌పై నిషేధం విధిస్తే మరి కొన్ని రాష్ట్రాల్లో అలాంటి గేమ్స్ ఇంకా సాగుతున్నాయి.
తెలంగాణ, ఏపీల్లో కూడా ఇలాంటి ఫాంటసీ లీగ్స్, తీన్ పత్తా వంటి వాటిలో చాలా మంది డబ్బులు పెట్టి ఆడుతున్నారు.ఇలాంటి వాటిపై తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు.
తాజాగా అక్టోబర్ 5వ తేది నుంచి కర్ణాటక సర్కార్ కూడా ఇలాంటి గేమింగ్ కంపెనీలపై నిషేధం పెట్టింది.

కర్ణాటకలో చాలా యాప్స్ వాడకాన్ని నిషేధించారు.కానీ డ్రీమ్11 మాత్రం ఇంకా తమ యాప్ ను కర్ణాటకలో చేపడుతోంది.ఈ విషయంపై బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్రీమ్ 11 సంస్థ, దాని వ్యవస్థాపకులపై కేసు పెట్టారు.
బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి డ్రీమ్11 ఐపీఎల్ మ్యాచ్ ప్రిడిక్షన్స్‌లో బెట్టింగ్ పెట్టాడు.తనకు తప్పకుండా డబ్బులు గెలుస్తారని చెప్పిన డ్రీమ్ 11 తనను ఇప్పుడు మోసం చేస్తోందని అతను కేసు నమోదు చేశాడు.