షుగర్ లేదా పంచదార లేదా చక్కెర.ఆరోగ్యానికి హాని చేసే తెల్లటి విషం.
పంచదార తినడానికి తియ్యగా రుచిగా ఉంటుంది.కానీ, ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు అందించకపోగా.
అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది.అందుకే పంచదారకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
అయితే పంచదార ఆరోగ్యానికి మేలు చేయకపోయినా.కొన్ని కొన్ని అవసరాలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మరి లేటెందుకు చక్కెరను ఇతర విధాలుగా ఎలా ఉపయోగించవచ్చో చూసేయండి.
సాధారణంగా కొందరి ఇళ్లల్లో బొద్దింకలు తెగ విసిగిస్తుంటాయి.
అయితే బొద్దింకలను తరమి కొట్టడంలో పంచదార సూపర్‌గా సహాయపడుతుంది.అందుకోసం పంచదారను మెత్తగా పొడి చేసి.
దానికి సమానంగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని బొద్దింకలు సంచరించే ప్రదేశం లో చల్లండి.
తద్వారా బొద్దింకలు పరార్ అవుతాయి.
అలాగే పువ్వులు ఎక్కువ సమయం పాటు ఫ్రెష్‌గా ఉంచడంలోనూ షుగర్ ఉపయోగపడుతుంది.
ఒక గ్లాస్ వాటర్‌లో రెండు స్పూన్ల పంచదార, ఒక స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి.అందులో పువ్వులు ఉంచితే ఎక్కువ సమయం పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.

బట్టలపై మరకలను తొలిగించడంలోనూ పంచదార యూజ్ అవుతుంది.అందుకు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొన్ని స్పూన్ల చక్కెర మరియు గోరు వెచ్చని నీరు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరకలపై అప్లై చేసి బాగా రుద్ది.అనంతరం సోప్‌తో వాష్ చేయాలి.ఇలా చేస్తే ఇట్టే మరకలు పోతాయి./br>
లిప్ స్టిక్‌ను ఎక్కువ సమయం పాటు ఉండేలా చేయడంలోనూ షుగర్ ఉపయోగపడుతుంది.
లిప్ స్టిక్ వేసుకున్న వెంటనే పెదవులపై పంచదార చల్లి కాసేపు ఉంచి ఆ తర్వాత తొలిగించాలి.ఇలా చేస్తే లిప్ స్టిక్ ఎక్కువ సేపు పెదవులకు అంటి పెట్టుకునే ఉంటుంది.