ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది కామన్‌గా ఎదుర్కొనే సమస్య కాళ్ల పగుళ్లు.
ఇది చిన్న సమస్యే అయినప్పటికీ.నడుస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పిని కలగజేస్తుంది.
అలాగే పగుళ్ల కారణంగా కాళ్లు అంద విహీనంగా కూడా కనిపిస్తాయి.అందుకే కాళ్ల పగుళ్లను నివారించుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే కర్పూరంతోనూ కళ్ల పగుళ్లకు చెక్ పెట్టవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా తెల్ల కర్పూరం తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్పూన్ కర్పూరం పూడి మరియు ఒకటిన్నర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పగుళ్లపై పూసి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో పాదాలకు శుభ్రంగా చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు ఒక సారి చేస్తే పగుళ్ల క్రమంగా తగ్గి పాదాలు మృదువుగా మారతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కర్పూరం పొడి, చిటికెడు పసుపు, కొన్ని వేపాకులు, మరియు కొబ్బరి నూనె వేసి కాసేపు మరిగించాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత పగుళ్లపై అప్లై చేసుకోవాలి.బాగా ఆరిన తర్వాత నీటితో పాదాలను క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేసినా కూడా పగుళ్లు తగ్గు ముఖం పడతాయి.
ఇక గోరు వెచ్చని నీటిని ఒక బకెట్లో తీసుకుని.
అందులో కొద్దిగా కర్పూరం పోడి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్‌ను పాదాలను పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
అనంతరం మామూలు వాటర్‌తో పాదాలను క్లీన్ చేసుకుని.తడి లేకుండా తుడిచి మాశ్చరైజన్ రాసుకోవాలి.
ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.