వర్షాకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు.ఈ అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎంతో మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే బచ్చలి కూర( Spinach ) సంవత్సరం పొడవునా లభించే ఆకుకూరలలో ముఖ్యమైనది.బచ్చలి కూరలో విటమిన్ సి మరియు అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి.
అలాగే బచ్చలి కూర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
అలాగే సిట్రస్ పండ్లలో నిమ్మకాయలు, ద్రాక్ష పండ్లు, కిన్నో, స్వీట్ లైమ్, మండారిన్ గ్రేప్ ఫ్రూట్ వంటి అనేక రకాల పండ్లు ఉంటాయి.ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
విటమిన్ సి రక్తంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ఉపయోగపడుతుంది.
పూర్వం రోజుల నుంచి ఆయుర్వేదంలో అనేక రోగాలకు చికిత్స చేయడానికి వెల్లుల్లి నీ ఉపయోగిస్తున్నారు.వెల్లుల్లి( garlic ) తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరిని తీసుకోవాలి.ఉసిరికాయను తీసుకోవడం వల్ల జలుబు మరియు జ్వరం వంటి సీజనల్ వ్యాధుల ప్రమాదం దూరం అవుతుంది.ఇంకా చెప్పాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో జామ, బొప్పాయి, పుచ్చకాయ వంటి కొన్ని ప్రత్యేక పండ్లను తీసుకోవడం ఎంతో మంచిది.
అలాగే అల్పాహారంగా జమ పండు కూడా తీసుకోవచ్చు.అలాగే ఔషధ గుణాలతో నిండిన అల్లం రుచిగా ఉండడమే కాకుండా సహజంగా మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల అల్లం వాపు, నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.అధిక కొలెస్ట్రాల్ ను అదుపు చేయడంలో అల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.