ముఖంపై మచ్చలు, మొటిమలు( Scars, pimples ) లేకుండా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు.కానీ కాలుష్యం, యూవీ కిరణాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పుల కారణంగా అనేక సౌందర్య సమస్యలు వస్తూ ఉంటాయి.
ఈ సమస్యలకు చెక్ పెట్టి కాంతివంతమైన చర్మం పొందడానికి కేవలం రెండు పదార్థాలు అవసరం అని నిపుణులు చెబుతున్నారు.ఈ పదార్థాలు నిత్యం వంటింట్లో ఉంటాయి.
ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు.
అలాగే అందంగా ఉండడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీమ్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

అలాగే బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి అందంగా మారెందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కానీ వాటి ప్రభావం చాలా తక్కువ సమయం వరకు ఉంటుంది.ఇలాంటి పరిస్థితులలో మీరు మెరిసే చర్మాన్ని పొందడానికి కొన్ని సులువైన చిట్కాలను కేవలం మీ ఇంట్లో లభించే ఈ వస్తువుల నుంచి తయారు చేసుకోవచ్చు.
ఆ రెండు పదార్థాలు.ఒకటి బియ్యం పిండి( rice flour ), మరొకటి పాలు.అవును ఈ రెండిటిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ వేసుకుంటే, ముఖంలో గ్లో వస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.

ముందుగా గ్లాసు పాలు( milk ) తీసుకోవాలి.ఫ్యాట్ మిల్క్ అయితే మంచిది.ఆ తర్వాత ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల బియ్యం పిండి వేసి సరిపడా పాలు వేసి స్టవ్ మీద పెట్టాలి.ఇది చక్కగా క్రీం అయ్యేవరకు అలాగే కలుపుతూ ఉండాలి.
అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి.పూర్తిగా క్రీమ్ లాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ముఖాన్ని శుభ్రం చేసి రెడీ చేసిన క్రీమ్ ను ముఖానికి అప్లై చేయాలి.అలాగే 15 నిమిషాల్లో తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వలన మచ్చలు తగ్గి చర్మంపై చర్మాన్ని గ్లాస్ స్కిన్ లా ఉండేలా చేస్తుంది.