చుండ్రును మాయం చేసి జుట్టును ఒత్తుగా మార్చే మ్యాజికల్ ఆయిల్ మీకోసం!

చుండ్రు.( Dandruff ) చాలా మందిని కలవర పెట్టే సమస్యల్లో ఒకటి.అలాగే పల్చటి జుట్టుతో కూడా ఎందరో బాధపడుతుంటారు.ఈ రెండు సమస్యలకు కారణాలు వేరైనా పరిష్కారం ఒకటి ఉంది.ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ను కనుక వాడితే చుండ్రు మాయం అవ్వడమే కాదు జుట్టు కొద్దిరోజుల్లోనే ఒత్తుగా సైతం పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్( Magical Oil ) ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.

 This Magical Oil Helps To Remove Dandruff And Makes Hair Thicker!, Magical Oil,-TeluguStop.com

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Oil, Magical Oil, Thick-Telug

ముందుగా ఒక క‌ల‌బంద( Aloevera ) ఆకు తీసుకుని వాటర్ తో కడిగి సైడ్స్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి క‌డాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ నువ్వుల నూనె వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కలబంద మిశ్రమాన్ని వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, నాలుగు ల‌వంగాలు వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.

Telugu Dandruff, Dandruffremoval, Care, Care Tips, Oil, Magical Oil, Thick-Telug

ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్టీల్ స్టైనర్ సహాయంతో ఆయిల్ లో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్( Scalp ) కు బాగా పట్టించి వేళ్ళతో సున్నితంగా పదినిమిషాలు మసాజ్ చేసుకోవాలి.

మరొకటి రోజు మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే కనుక చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.

అదే సమయంలో తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.దాంతో జుట్టు రాలడం(Hair Fall ) తగ్గి ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.

కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు పల్చటి జుట్టుతో స‌త‌మ‌తం అవుతున్నవారు తప్పకుండా ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube