పెళ్లి చేసుకోబోతున్న ఒలింపిక్ పతక విజేత

ఇండియన్ స్టార్ షట్లర్‌ పీవీ సింధు( PV Sindhu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా ఆమె పెళ్లి పీటలు ఎక్కుతోంది.

 Who Is Venkata Datta Sai Find Out More About Pv Sindhu To-be Husband Details, Pv-TeluguStop.com

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వెంకట్ దత్త సాయిని( Venkata Datta Sai ) డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నారు.డిసెంబర్ 20న వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

వీరిద్దరూ 22న ఏడు రౌండ్లు వేసి 24న హైదరాబాద్‌లో( Hyderabad ) గ్రాండ్‌గా రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.పీవీ సింధుకు హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపార వేత్త వెంకట దత్త సాయితో వివాహం కుదిరింది.

ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పివి రమణ తెలియ జేశారు.

Telugu Badmintonpv, Pv Sindhu, Pvsindhu-Latest News - Telugu

కొన్ని కథనాల ప్రకారం, వెంకట్ దత్త సాయి హైదరాబాద్‌లోని పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.అతను అనుభవజ్ఞుడైన పారిశ్రామికవేత్త.వెంకట్ దత్తా సాయి ఫైనాన్స్, డేటా సైన్స్ మరియు అసెట్ మేనేజ్‌మెంట్‌లో తనదైన ముద్ర వేశారు.

పోసిడెక్స్ టెక్నాలజీస్ ప్రధానంగా దేశంలో డేటా మేనేజ్‌మెంట్‌లో పని చేస్తుంది.ఇది దేశంలోని 7 ప్రైవేట్ బ్యాంకులకు సేవలను అందిస్తుంది.దేశంలోని 9 పెద్ద NBFCలు కూడా ఈ కంపెనీకి కస్టమర్లు.ఈ సంస్థ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డేటా మేనేజ్‌మెంట్ పనులను కూడా చేస్తుంది.

Telugu Badmintonpv, Pv Sindhu, Pvsindhu-Latest News - Telugu

వెంకట్ దత్తా సాయి ఫ్లేమ్ విశ్వవిద్యాలయం నుండి అకౌంటింగ్, ఫైనాన్స్‌లో BBA చేసారు.అతను బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.ఇక మరోవైపు 2 సంవత్సరాలుగా అంతర్జాతీయ టైటిల్ కోసం వేచి ఉన్న పీవీ సింధు. తాజాగా సయ్యద్‌ మోదీ ఇంటర్నేషన్‌ సూపర్‌ 300 టోర్నీలో విజయం సొంతం చేసుకుంది.

చివరి సారిగా 2022లో సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు నిలిచిన సంగతి అందరికీ విధితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube