ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ ప్రవాహం లాంటింది.అందులో ఒక భాషలో గుర్తింపు పొందిన నటీనటులు మరికొన్ని భాషల చిత్రాల్లో నటిస్తూ చక్కటి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
నాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.అలాంటి కోవకు చెందిన నటీమణి నదియా.
తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించి వారెవ్వా అనిపించింది.వయసు పెరిగినా అందం, అభినయంలో ఏమాత్రం తేడా రానివ్వలేదు ఈ బ్యూటీ.
అంతేకాదు.ఈమె ఒకప్పుడు మోస్ట్ గ్లామరస్ సౌత్ ఇండియన్ హీరోయిన్.
ఈ విషయం మీలో చాలా మందికి తెలియక పోవచ్చు.కానీ ముమ్మాటికీ నిజం.
నిజానికి నదియా మళయాలం సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.అనంతరం తమిళ సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా కొనసాగింది.
సూపర్ స్టార్ క్రిష్ణ పెద్దకొడుకు రమేష్ బాబు నటించిన బజారు రౌడీ సినిమాలో హీరోయిన్ గా చేసి తెలుగు తెరకు పరిచయం అయ్యింది.తొలి సినిమాలోనే ఆమె డ్యూయెల్ రోల్ చేసి ఆకట్టుకుంది.
నదియా స్వస్థలం కేరళలోని వత్తనంతిట్ట గ్రామం.ఆమె అక్కడే పుట్టి పెరిగారు.తన అసలు పేరు జరీనా.ఆమె తండ్రి టాటా కంపెనీలో ఉద్యోగి కావడంతో ముంబైలో నివాసం ఉండేవారు.
నదియా మాత్రం తన చెల్లితో కలిసి తన బామ్మతో కేరళలోనే ఉండి చదువుకుంది.చిన్నప్పటి నుంచి తనకు నాట్యం అన్నా నటన అన్నా చాలా ఇష్టం.
సరైన వసతులు లేని కారణంగా తను నాట్యం నేర్చుకోలేదు.సినిమాలు మాత్రం బాగా చూసేది.
ఓరోజు తన క్లాస్ మేట్ ఇంటికి వెళ్లింది.తన తండ్రి దర్శకుడు పాజిల్.
అక్కడి వెళ్లిన నదియాను సినిమాల్లో నటిస్తావా? అని అడిగాడు తను.అయితే తన తండ్రిని అడగాలని చెప్పింది.

మొదట తన తండ్రి నో చెప్పినా తర్వాత ఒప్పుకున్నాడు. పూవే పూచూడువా అనే తమిళ రీమేక్ మూవీలో హీరోయిన్ గా చేసింది.ఈ సినిమాను తొలుత మలయాళంలో తీశాడు పాజిల్.ఆ సినిమాలో కూడా నదియానే నటించింది.ఇందులో నటటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది.ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.

పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత జయం రవి సినిమాలో రవి తల్లిగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.తెలుగులో మిర్చి సినిమా ద్వారా రెండో సినిమా చేసింది.ప్రస్తుతం వరుస ఆఫర్లతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యింది.