అధునిక భారతంలో నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమర్జెన్సీ.1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ వెల్లడించారు.ప్రజాస్వామ్య దేశంలో రెండు ఏండ్ల పాటు చీకటి రోజులు కొనసాగాయి.ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ఎంతో మంది జైలు పాలయ్యారు.ఇంకా చెప్పాలంటే ఇందిరా గాంధీ వారందరినీ జైల్లో పెట్టించారు.ఎమర్జెన్సీ విధింపు ప్రజాస్వామ్యంపై గొడ్డలి పెట్టుగా ప్రజాస్వామ్య వాదులు అభివర్ణించారు.
దేశంలోని ప్రముఖులంతా ఎమర్జెన్సీని తీవ్రంగా తప్పుబట్టారు.ఈ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచారు స్నేహలతా రెడ్డి.
ఇంతకీ ఈమె ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్నేహలతా రెడ్డి ఇండియన్ యాక్టర్, ప్రొడ్యూసర్, సామాజిక కార్యకర్త కూడా.
ఈమె ఇంగ్లీష్, కన్నడ, నాటక రంగాలతో పాటు సినిమా రంగంలోనూ రాణించింది.ఈమె స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది.
బ్రిటీష్ వారంటే ఉన్న కోపంతో తను క్రిస్టియన్ కుటుంబంలో జన్మించినా మళ్లీ హిందూ మతంలోకి తిరిగి వచ్చింది.భారతీయ సంప్రదాయం ప్రకారం కట్టుబొట్టు మార్చుకుంది.

ఈమె పట్టాభిరామిరెడ్డి అనే రచయిత కం దర్శకుడిని పెళ్లి చేసుకుంది.వీరిద్దరు భారత్ లో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు.దీంతో సర్కారు ఈమె మీద పగపట్టింది.బరోడా డైనమైట్ కేసులో ఈమె పాత్ర ఉందని అరెస్టు చేసింది.చార్జ్ షీట్ లో తన పేరు లేకపపోయిన దోషిగా పరిగణించారు.ఆమె జైలులో ఉన్న సమయంలో స్త్రీ ఖైదీలు జైలుకు రాగానే అందరి ముందు నగ్నంగా పరీక్షలు చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు.
ఆందోళన చేశారు.ఈ నింబధన తొలిగించేలా పోరాటం చేశారు.

అనుకున్నది సాధించారు.జైల్లో ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో పెరోల్‌పై విడుదలయ్యారు.కానీ కొద్ది రోజులకే ఆమె ఆరోగ్య పరిస్తితి విషమించి చనిపోయారు.ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుల్లో తనూ ఒకరుగా మిగిలారు.బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ సైతం స్నేహలతారెడ్డి పోరాట పటిమ గురించి తన ఆత్మకథలో రాసుకున్నారు.తనలాంటి వారి మూలంగానే ఎమర్జెన్సీ చీకటి రోజులు తొలిగిపోయాయని ఆయన పేర్కొన్నారు.