టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏ హీరో మార్కెట్ ఎంత అనే ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు.ఈ హీరోలాలో ఎవరు టాప్ అనే ప్రశ్నకు సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.బాహుబలి2 మూవీ( Baahubali 2 ) 1800 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని 5 సంవత్సరాలు కాగా ఇప్పటికీ ఆ సినిమా కలెక్షన్ల రికార్డులు బ్రేక్ కాలేదనే సంగతి తెలిసిందే.బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయడం పుష్ప2 కు( Pushpa 2 ) సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది.
నార్త్ ఇండియాలో పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీకి 20 శాతం ఆక్యుపెన్సీ ఉండగా టాక్ ఆధారంగా పుష్ప2 కలెక్షన్లు( Pushpa 2 Collections ) ఆధారపడి ఉంటాయి.బాలీవుడ్ లో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ ఒకింత భారీ స్థాయిలో జరగాల్సి ఉంది.బాహుబలి2 టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటిగా నిలవగా పుష్ప2 సినిమా ఆ రేంజ్ ను మరింత పెంచుతుందేమో చూడాలి.టికెట్ రేట్లు భారీగా ఉండటం ఈ సినిమాకు వరమని చెప్పవచ్చు.
పుష్ప ది రూల్ మూవీ హిట్టైతే ఈ సినిమా సీక్వెల్ పై కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.బన్నీ రేంజ్ ను డిసైడ్ చేసే మూవీ పుష్ప ది రూల్ అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.పుష్ప1 బాక్సాఫీస్ వద్ద, యూట్యూబ్ లో పలు క్రేజీ రికార్డులను సొంతం చేసుకుంది.పుష్ప ది రూల్ సైతం సరికొత్త రికార్డ్స్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.
అల్లు అర్జున్ కు( Allu Arjun ) ప్రస్తుతం పరిస్థితులు సైతం అనుకూలంగా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా 90 శాతం థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.రికార్డ్ స్థాయిలో రిలీజ్ దక్కడం ఈ సినిమాకు ప్లస్ కానుంది.పుష్ప ది రూల్ బాక్సాఫీస్ ను సైతం రూల్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.