పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం.నలుపు లేదా గోధుమ రంగులో ఏర్పడే మచ్చలనే స్కిన్ పిగ్నెంటేషన్ అని అంటారు.
వయసు పైబడిన వారు చాలా కామన్‌గా ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.అలాగే ఎండల్లో ఎక్కువగా తిరగడం, హార్మోన్ ఛేంజస్, కెమికల్స్ అధికంగా ఉండే చర్మ ఉత్పత్తులను వాడటం, ఆహారపు అలవాట్లు వంటి రకరకాల కారణాల వల్ల కూడా పిగ్నెంటేషన్ సమస్య ఏర్పడుతుంది.
కారణం ఏదైనా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్‌ను వాడితే.చాలా సులభంగా పిగ్నెంటేషన్‌కు బై బై చెప్పొచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్ల బ్రైన్ రైస్ వేసుకుని వాటర్‌తో రెండు సార్లు కడగాలి.
ఆ తర్వాత అందులో ఒక కప్పు వాటర్, గుప్పెడు పుదీనా ఆకులు వేసి.నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఇలా నానబెట్టుకున్న వాటిని వాటర్‌తో సహా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.పల్చటి వస్త్రం సాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బొప్పాయి జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్, రెండు చుక్కలు మింట్ ఎసెన్షియల్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల బ్రైన్ రైస్-పుదీనా జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్లే.ఈ క్రీమ్‌ను ఏదైనా బాక్స్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.

నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్‌ను తొలగించి వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత తయారు చేసుకున్న క్రీమ్‌ను ముఖానికి అప్లై చేసి.సున్నితంగా మసాజ్ చేసుకుని పడుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే పిగ్మెంటేషన్ సమస్య క్రమంగా దూరం అవుతుంది.