కురులు సిల్కీగా, షైనీగా మెరిసిపోవాలని దాదాపు ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.కానీ, ప్రస్తుత వర్షాకాలంలో అది చాలా మందికి అసాధ్యంగా మారుతుంది.
పైగా ఈ సీజన్‌లో హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, డ్యాండ్రఫ్ వంటి సమస్యలు తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.అయితే వీటికి చెక్ పెట్టి కురులను సిల్కీగా మరియు షైనీగా మెరిపించడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ మాస్క్ ఏంటీ.దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.
వంటి విషయాలను ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ పౌడర్ వేసి బాగా మరిగిచాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సాయంతో గ్రీన్ టీని ఫిల్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్, నాలుగు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, నాలుగు చుక్కలు మింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.షవర్ క్యాప్‌ను ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఈ విధంగా హెయిర్ మాస్క్ ను వేసుకుంటే కురులు సిల్కీగా, షైనీగా మెరుస్తాయి.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.చుండ్రు సమస్య నుండి సైతం ఉపశమనం లభిస్తుంది.కాబట్టి, తప్పకుండా ఈ న్యాచురల్ హెయిర్ మాస్క్‌ను ప్రయత్నించండి.