ఆ సమయంలో చనిపోతానని అనుకున్నా.. మనీషా కోయిరాలా కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి మనీషా కోయిరాలా( Manisha Koirala ) గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనీషా కోయిరాలా మాట్లాడుతూ చెప్పిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 Manisha Koirala Comments About Her Cancer Treatment Days Details, Manisha Koiral-TeluguStop.com

క్యాన్సర్ చికిత్స( Cancer Treatment ) రోజులను గుర్తు చేసుకుంటూ మనీషా కోయిరాలా కీలక వ్యాఖ్యలు చేశారు.చికిత్స తీసుకునే సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Heeramandi Web, Manisha Koirala, Manishakoirala-Movie

వైద్యుల చికిత్సతో పాటు తల్లి ప్రోత్సాహం ఆమె నింపిన మనో ధైర్యం వల్లే తాను మహమ్మారి నుంచి బయటపడ్డానని మనీషా కోయిరాలా వెల్లడించారు.2012 సమయంలో మనీషా అండాశయ క్యాన్సర్ బారిన పడ్డారు.మూడు సంవత్సరాల చికిత్స అనంతరం ఆమె క్యాన్సర్ ను జయించడం జరిగింది.ఈ విషయాల గురించి ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ కు( Cancer ) చికిత్స తీసుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయని అన్నారు.

Telugu Heeramandi Web, Manisha Koirala, Manishakoirala-Movie

ఆ సమయంలో భరించలేని బాధను, నొప్పిని అనుభవించానని ఆమె చెప్పుకొచ్చారు.ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఈ మహమ్మారి చివరి దశలో ఉన్న సమయంలో గుర్తించామని మొదట నేను అందరిలా భయపడి చనిపోతానని అనుకున్నానని ఆమె పేర్కొన్నారు.న్యూయార్క్ లోని( New York ) గొప్ప వైద్యులు నాకు చికిత్స చేశారని ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చిన రెండో అవకాశం అని ఆమె కామెంట్లు చేశారు.

మనీషా ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

మనీషా కోయిరాలా రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.త్వరలో మనీషా కోయిరాలా హీరామండి( Heeramandi ) రెండో భాగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.మనీషా కోయిరాలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube