11 అనే పదం వైసీపీ అధినేత జగన్ కు( YS Jagan ) ఇబ్బందికరంగా మారింది.ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓటమికి చెందడం, 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో అప్పటి నుంచి 11ను పదేపదే ప్రస్తావిస్తూ జగన్ ను, వైసీపీ నాయకులను ఇరుకున పెట్టే ప్రయత్నం టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలోనూ అనేక ట్రోలింగ్స్ నడుస్తూనే ఉన్నాయి.జగన్ 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో, వైసిపి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
దీనిపైన అనే ట్రొలింగ్స్ నడుస్తున్నాయి.

దీనికి తగ్గట్లుగానే ఇప్పుడు ఏపీ బడ్జెట్ సమావేశాలు( AP Budget Sessions ) 11వ తేదీన ప్రారంభం కానున్నాయి.11వ తేదీన గవర్నర్ ప్రసంగం ఉంటుంది.అదే రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉంది .11వ తేదీన నిర్వహించబోయే ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 11వ తేదీన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభలో అడుగు పెడతారా లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో అనేక ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.2014లో 60 కి పైగా స్థానాలు దక్కించుకున్న వైసిపి( YCP ) బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా కొంతమంది సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.

ఈసారి కూడా 11వ తేదీన బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక వైసీపీని అవమానించాలనే వ్యూహం ఉందనే అనుమానాలు వైసిపి శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.దీంతో ఈ సమావేశాలకు దూరంగా ఉండాల్సిందిగా ఇప్పటికే వైసిపి అధిష్టానానికి సూచనలు అందుతున్నాయి. అయితే ఈ విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు.
దీంతో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరవుతారా .సమావేశాలకు దూరంగా ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది .ఇక సోషల్ మీడియాలో టిడిపి శ్రేణులు ఇదే విషయంపై వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు.11 పిలుస్తోంది రా కదలిరా అంటూ తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.