తెలుగులో ఇటీవలే మొదలైన బిగ్బాస్ సీజన్ తెలుగు 8( Bigg Boss Telugu 8 ) షో చూస్తుండగానే అప్పుడే తొమ్మిదో వారంలోకి ఎంట్రీ ఇచ్చేసింది.ఇప్పటికే హౌస్ లోకి చాలామంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వగా మరి కొందరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.
ఇక గత వారం నయని పావని( Pavani ) హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఇకపోతే మామూలుగా నామినేషన్స్ ప్రక్రియలో ఎప్పుడూ ఇద్దరినీ నామినేట్ చేయాలని చెప్పే బిగ్ బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే చేయాలని చిన్న కండిషన్ పెట్టాడు.
అలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది.
పలు కారణాలతో ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు.అయితే ఒక్క రోజులోనే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు.మంగళవారం కూడా నామినేషన్స్ కొనసాగాయి.
తాజాగా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియలో హరితేజ,( Hari Teja ) ప్రేరణ( Prerana ) మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఇప్పటి వరకు జరిగిందంతా చాలు.ఇక నుంచి ఆపేద్దాం.
నోరు బాగుంటే ఊరు బాగుంటది అంటూ ప్రేరణను అడిగింది హరితేజ.ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే నామినేట్ చేసుకుందాం.
అంతే కానీ మనిద్దరికీ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు.
ఈ మాటలకు హరితేజను అభినందిస్తూ మాట్లాడింది ప్రేరణ.ఆ తర్వాత మళ్లీ హరితేజను ఫేక్ అని ప్రేరణ అనడంతో మరింత మాటల యుద్ధం నడిచింది.ప్రతిసారి ఫేక్ అనొద్దు.
మాటలు ముందు సక్కగా మాట్లాడు అంటూ హరితేజ వాదించింది.అయితే తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే హరితేజ అలాగే ప్రేరణ మధ్య పెద్దగానే మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది.
ఏం జరిగిందో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ని చూడాల్సిందే.