తెలుగు సినిమాలలో తన కామెడీ టైమింగ్ తో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న నటులలో రాజబాబు (rajababu)ఒకరు.రాజబాబు హాస్యనట చక్రవర్తి అని పిలిచేవారంటే ఆయన కామెడీకి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో సులువుగా అర్థమవుతుంది.
హీరో ఎవరైనా రాజబాబు సినిమాలో నటిస్తే సినిమా హిట్టైనట్టే అని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ ఉండేది.ఒకానొక దశలో రాజబాబు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారు.
ఒక సినిమా కోసం సీనియర్ ఎన్టీఆర్ 35,000 రూపాయలు రెమ్యునరేషన్ గా అందుకున్నారు.ఆ సమయంలో నిర్మాత రాజబాబుకు 20,000 రూపాయల రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పారు.
అయితే రాజబాబు(rajababu) మాత్రం తనకు కూడా 35 వేల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరారు.ఆ సమయంలో నిర్మాత ఎన్టీఆర్ హీరో అని మీరు కమెడియన్ అని చెప్పగా అయితే హీరోనే కమెడియన్ గా చూపించి సినిమాను విడుదల చేయండని రాజబాబు కామెంట్ చేశారట.
రాజబాబు కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు రాకపోవడంతో ట్యూషన్లు సైతం చెప్పుకొని బ్రతికిన రోజులు ఉన్నాయి.అంతస్తులు సినిమాలో నటించినందుకు రాజబాబు 1300 రూపాయల రెమ్యునరేషన్ ను అందుకున్నారు.5 రూపాయల కోసం గంటల తరబడి టి.నగర్(T.
Nagar) లో ఇబ్బందులు పడిన రోజుల నుంచి లక్ష రూపాయల ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకునే వారని సమాచారం.
రాజబాబు, రమాప్రభ (Rajababu, Ramaprabha)కాంబోకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉండేది.ఈ కాంబోలో తెరకెక్కిన సినిమాలన్నీ హిట్లుగా నిలిచాయి.రాజబాబు గంటల చొప్పున నటించిన సందర్భాలు ఉన్నాయి.రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.1983 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఆయన కన్నుమూశారు.45 సంవత్సరాల వయస్సులో ఆయన మృతి చెందారు.తన ఎక్స్ ప్రెషన్లతో కడుపుబ్బా నవ్వించిన ప్రతిభ రాజబాబు సొంతమని చెప్పడంలో సందేహం ఏ మాత్రం అవసరం లేదు.