ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి కిరణ్ అబ్బవరం ప్రశంసలు అందుకున్నారు.కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడిక్ థ్రిలర్ గా తెరకెక్కిన క మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.
ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా కలెక్షన్లు ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి.అయితే ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి దివ్యాంగులైన చిన్నారుల కొరకు క మూవీ స్పెషల్ షో ప్రదర్శించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎం.ఎం.లో చిన్నారుల కోసం క స్పెషల్ షో ప్రదర్శించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.క సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తమ కోసం స్పెషల్ షో ప్రదర్శించడంపై చిన్నారులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇప్పటికే ఈ సినిమా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయిన సంగతి తెలిసిందే.ఓటీటీలో సైతం ఒకింత ఆలస్యంగా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.“క” సినిమా(ka movie) సెకండ్ వీకెండ్ ను సైతం క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది.కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) తెలుగు హీరో కావడం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) కలెక్షన్ల పరంగా ఎంతగానో ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కిరణ్ అబ్బవరం తర్వాత సినిమా క సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కే ఛాన్స్ ఉంది.క సీక్వెల్ కు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.క సీక్వెల్ బిజినెస్ పరంగా కూడా సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది.
కిరణ్ అబ్బవరంకు భారీ హిట్ దక్కడం అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ సైతం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.