ప్రస్తుత రోజులలో కరోనా వ్యాధి మళ్లీ విజృంభిస్తూ ఉంది.కరోనా( Corona ) కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు.
ఈ సారి కరోనా ప్రభావం తక్కువగా ఉండడంతో ఇక ఈ వ్యాధి పూర్తిగా పోయిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.కానీ ఈ మహమ్మారి ఎటు పోకుండా మన మధ్య ఉంటూ తన రంగు రూపును మార్చుకుంటూ ప్రజలను వెంటాడుతూ ఉంది. తాజాగా JN.1 గా రూపాంతరం చెంది ప్రపంచ దేశాలను వణికిస్తు ఉంది.అయితే ఈ కోవిడ్ వైరస్ ను తట్టుకోవాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది.
ఆ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బచ్చలికూర, పాలకూర( Spinach ), కొల్లార్డ్ గ్రీన్స్, స్విస్ చార్డ్ వంటి ఆకుకూరల్లో విటమిన్లు ఏ,సీ,కే తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.కోవిడ్ లాంటి అనారోగ్య సమస్యలతో పోరాటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.ఇంకా చెప్పాలంటే బాదం పొద్దో తిరుగుడు గింజలు, చియ గింజల్లో( Chia Seeds ) విటమిన్ ఈ, జింక్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.ఇవన్నీ రోగనిరోధక శక్తి( Immunity )ని పెంచుతాయి.
వీటిని తినడం వల్ల శరీరానికి బలమైన రోగనిరోధక కణాలను నిర్మించడానికి, వ్యాధులతో పోరాడడానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్ లను అందిస్తాయి.అలాగే వెల్లుల్లి, అల్లం ఆయుర్వేద పరంగా మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.వ్యక్తి రోగాల బారిన పడకుండా ఇవి కాపాడతాయి.యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో ఇవి నిండి ఉంటాయి.వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది.ఇది రోగనిరోధక కణాల కార్యకలాపాలను పెంచుతుంది.
అల్లం లోని జింజెరాల్ కడుపులో మంటను దూరం చేస్తుంది.అలాగే శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఇంకా చెప్పాలంటే నారింజ, ద్రాక్ష పండ్లు, నిమ్మకాయలు, బత్తాయిలు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.