నేడు ఏపీ క్యాబినెట్ భేటీ  ... ఈ కీలక అంశాలపైనే చర్చ

ఏపీ క్యాబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు( CM Chandrababu ) అధ్యక్షతను ప్రారంభమైంది.  ఈ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోమన్నారు.

 Cm Chandrababu To Discuss On These Key Topics In Ap Cabinet Meeting Today Detail-TeluguStop.com

ఈనెల 11వ తేదీన నిర్వహించబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఏ అంశాలపై చర్చించాలనే దానిపైన మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.  పూర్తిస్థాయి బడ్జెట్ పైన క్యాబినెట్ బేటిలో చర్చించనున్నారు.

ఈ భేటీలోనే బడ్జెట్( Budget ) గురించి పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.అలాగే ఓ భారీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Telugu Ap Asembly, Ap, Cm Chandrababu, Steel, Nissan Steel, Ysrcp-Politics

ఉక్కు సంస్థ ఆర్సెలార్ మిట్టల్, జపాన్ కు చెందిన నిస్సాన్ స్టీల్ జాయింట్ వెంచర్ అయిన అర్సెలార్ మెటల్ నిస్సాం స్టిల్స్ ఇండియా సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది.అనకాపల్లి జిల్లాలో( Anakapalli District ) ఆర్సేలార్ మిట్టల్ నిస్సాం స్టిల్స్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ మేరకు దీనికి అవసరమైన ప్రతిపాదన కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.అలాగే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ తో( Integrated Steel Plant ) పాటుగా టెర్మినస్ క్యాస్టివ్ పోర్టు అభివృద్ధికి మిట్టల్ సంస్థ ప్రతిపాదనలు పంపడంతో దీనిపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Telugu Ap Asembly, Ap, Cm Chandrababu, Steel, Nissan Steel, Ysrcp-Politics

అలాగే ల్యాండ్ గ్రాబింగ్  యాక్ట్ 1982 రిపీట్ బిల్లు ప్రతిపాదనపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.ల్యాండ్ గ్రాఫింగ్ చట్టంలోని కొన్ని నిబంధనలను కారణంగా భూ ఆక్రమణదారులపై కేసులు నమోదుకు ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం వీటిపైన పూర్తిస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.అవసరమైతే ఈ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024 ను తీసుకొచ్చే విషయం పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అలాగే పలనాడు జిల్లాలోని సరస్వతి భూముల అంశం పైన పోలవరం ప్రాజెక్టు పనుల పైన శ్రీ సమాజంలో చర్చించనున్నారు.ప్రధానంగా ఈనెల ఆఖరికి ఓటు ఎకౌంటు బడ్జెట్ కాల పరిమితి ముగియనుండడంతో దీనిపైన ప్రధానంగా చర్చించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube