అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.అందరిచూపు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లపైనే(Kamala Harris ,Donald Trump) ఉంది.
అయితే అధ్యక్ష ఎన్నికలతో పాటు రాష్ట్ర చట్టసభలు, స్థానిక సంస్థలకు కూడా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్ధులు(Candidates of Indian origin) కూడా బరిలో దిగారు.
అమెరికా రాజకీయాల్లో భాగం కావాలనే ఉద్దేశం ఇటీవల పెరుగుతున్న దశలో దాదాపు మూడు డజన్లకు పైగా భారతీయ అమెరికన్లు స్థానిక సంస్థలు, రాష్ట్రాల చట్టసభలకు పోటీ చేస్తున్నారు.
కమ్యూనిటీ సభ్యులు అన్ని స్థాయిల్లో ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా భారత సంతతి నేత, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పలు సమావేశాలలో ప్రోత్సహిస్తున్నారు.
లోకల్ బాడీ(local bodies) ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో భారతీయులు బరిలో నిలిచిన రాష్ట్రంగా కాలిఫోర్నియా(California) ఉంది.ఈ రాష్ట్రం నుంచి ఇప్పటికే డాక్టర్ అమీ బెరా, రో ఖన్నాలు కాంగ్రెస్ సభ్యులుగా ఉండగా.
ఉపాధ్యక్షురాలు, ప్రస్తుత డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్ కాలిఫోర్నియాకు చెందినవారే.
జిల్లా 11కి కౌంటీ సూపర్‌వైజర్‌గా అద్దా చిస్తీ, సిటీ కాలేజ్ బోర్డ్ ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్కోకు అలియా చిస్తీ, స్టేట్ అసెంబ్లీకి దర్శనా పటేల్, శాన్‌మాటియో సిటీ కౌన్సిల్‌కు నికోల్ ఫెర్నాండెజ్, లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్‌కు నిత్య రామన్, ఫాస్టర్ సిటీకి రిచా అవస్తీ , ఎమెరీవిల్లే సిటీ కౌన్సిల్‌కు సుఖ్‌దీప్ కౌర్ బరిలో నిలిచారు.అలాగే సిలికాన్ వ్యాలీలోని డిస్ట్రిక్ట్ 26 నుంచి కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని తారా శ్రీకృష్ణన్ ఆశిస్తున్నారు.దాదాపు 90 వేల మంది భారతీయ అమెరికన్ జనాభాతో కాలిఫోర్నియా ఎక్కువ మంది భారత సంతతి జనాభాను కలిగివున్న అమెరికా రాష్ట్రంగా నిలిచింది.
ఇక మిచిగన్‌లోని డిస్ట్రిక్ట్ 14 ఓక్లాండ్ కౌంటీ కమీషనర్‌గా డాక్టర్ అజయ్ రామన్ పోటీ చేస్తున్నారు.మిచిగాన్ స్టేట్ హౌస్ రేసులో అనిల్ కుమార్, రంజీవ్ పూరీ(Anil Kumar, Ranjeev Puri) బరిలో నిలిచారు.అరిజోనా స్టేట్ సెనేట్ బరిలో ప్రియా సుందరేషన్, స్కూల్ బోర్డ్‌కు రవి షా పోటీ చేస్తున్నారు.పెన్సిల్వేనియాలో ఆనంద్ పటేక్, అన్నాథామస్, అరవింద్ వెంకట్‌లు స్టేట్ హౌస్‌కు పోటీ చేస్తుండగా.
నిఖిల్ సవాల్ స్టేట్ సెనేట్‌లోకి ప్రవేశించాలని కోరుతున్నారు.వీరితో పాటు అశ్విన్ రామస్వామి, చంతేల్ రఘు, పవన్ పరేఖ్, డానీ ఆవుల, మానిత సంఘ్వీ, జోహ్రాన్ మందానీ, ఆషికా గంగూలీ తదితరులు కూడా వివిధ రాష్ట్రాల చట్టసభలు, లోకల్ బాడీ ఎన్నికల్లో బరిలో నిలిచారు.