ఖలిస్తాన్ (Khalistan)వేర్పాటువాదుల కారణంగా కెనడాలో (Canada)పరిస్ధితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి.ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ (Tiger Force chief Hardeep Singh Nijjar)హత్య తర్వాత ఇవి మరింతగా దిగజారాయి.
నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canadian Prime Minister Justin Trudeau)వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు మరింత చిచ్చుపెటట్టాయి.ఈ నేపథ్యంలో ఆదివారం బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడి చేశారు.
ఖలిస్థానీ జెండాలు పట్టుకున్న వ్యక్తులు హిందూ సభ ప్రాంగణంలోని వ్యక్తలపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనిని కెనడాలోని భారతీయ కమ్యూనిటీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు ఖండించారు.
![Telugu Canada, Canadianprime, Hindus Sikhs, Khalistan, Tigerforce-Telugu Top Pos Telugu Canada, Canadianprime, Hindus Sikhs, Khalistan, Tigerforce-Telugu Top Pos](https://telugustop.com/wp-content/uploads/2024/11/An-open-letter-by-a-Sikh-businessman-in-Canada-over-recent-violence-between-Hindus-and-Sikhs-a.jpg)
ఈ ఘటనలపై బ్రాంప్టన్‌కు చెందిన సిక్కు వ్యాపారవేత్త ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.కెనడియన్ ప్రవాసుల్లోని సిక్కులు, హిందువుల్లోని మెజారిటీ వ్యక్తులు హింసాత్మక ఘటనలకు మద్ధతు ఇవ్వరని ఆయన పేర్కొన్నారు.ఇది మన సమాజం కోరుకునేది కాదని, కెనడాలో మనమంతా సామరస్యంగా జీవిస్తున్నామని .రెండు మతాలు ఒకరినొకరు గౌరవించుకుంటాయని సదరు వ్యాపారవేత్త తెలిపారు.గుర్భానీలో వ్రాసినట్లుగా మానవ జాతి ఒకటేనని గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.సిక్కులు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలనే తమ మతం బోధిస్తుందని.అందుచేత అలాంటి హింసాత్మక చర్యలు మనుషుల్ని విభజించకుండా చూసుకోవడం మన సమిష్టి బాధ్యత అని ఆ వ్యాపారవేత్త పేర్కొన్నారు.
![Telugu Canada, Canadianprime, Hindus Sikhs, Khalistan, Tigerforce-Telugu Top Pos Telugu Canada, Canadianprime, Hindus Sikhs, Khalistan, Tigerforce-Telugu Top Pos](https://telugustop.com/wp-content/uploads/2024/11/An-open-letter-by-a-Sikh-businessman-in-Canada-over-recent-violence-between-Hindus-and-Sikhs-b.jpg)
ఈ ఘటనలపై సిక్కు, హిందూ కమ్యూనిటీలకు చెందిన నేతలు , సంస్థలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.బ్రాంప్టన్‌లో హిందూ సభ మందిర్ (Hindu Sabha Mandir)వెలుపల జరిగిన సంఘటనను అంటారియో సిఖ్స్ అండ్ గురుద్వారా కౌన్సిల్ ఖండించాయి.హిందూ ఆలయంలో జరిగిన ఘటనకు ప్రతీకారంగా మాల్టన్ సిక్కు ఆలయంపై జరిగిన దాడిని హిందూ సమాఖ్య కూడా తీవ్ర ఖండించింది.
ఇలాంటి హింసాత్మక సంఘటనలకు ప్రజలు, ఏ సంస్థ మద్ధతు ఇవ్వరని ప్రముఖులు పేర్కొన్నాయి.మందిర్, గురుద్వారా అనేవి కేవలం భవనాలు మాత్రమే కాదు.అవి మన కమ్యూనిటీల ఆధ్యాత్మిక హృదయానికి ప్రాతినిథ్యం వహించే పవిత్ర స్థలాలని వారు పేర్కొన్నారు.నిరసన తెలియజేయాలనుకునే వారు ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నిరసనలు చేయవద్దని వారు విజ్ఞప్తి చేశారు.