సజావుగానే ధాన్యం కొనుగోళ్లు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ బొప్పాపూర్ లో కొనుగోలు కేంద్రం తనిఖీ

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District) : ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సజావుగానే ధాన్యం సేకరణ కొనసాగుతుందని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ స్పష్టం చేశారు.ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Smooth Purchases Of Grain Additional Collector Khemya Naik Inspects The Purchase-TeluguStop.com

మొత్తం ఎంత మంది రైతులు ధాన్యం కేంద్రంలో పోశారు? ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్లు ధాన్యం సేకరించారని జిల్లా పౌర సరఫరాల అధికారిని ఆరా తీశారు.రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు కల్పించామని తెలిపారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడారు.రైతులందరూ తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు.

కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.దళారులకు విక్రయించవద్దని కోరారు.

ఇక్కడ జిల్లా సహకార అధికారి రామకృష్ణ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube