మద్దతు ధర పొందాలి కొనుగోలు కేంద్రాల సందర్శనలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha), రాజన్న సిరిసిల్ల జిల్లా :రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని (Big Bonala, Small Bonala, Mushtipalli, Sardapur)పెద్ద బోనాల, చిన్న బోనాల, ముష్టిపల్లి, సర్దాపూర్( ల్లోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.
అనంతరం రైతులతో మాట్లాడారు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు.
ఆయా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు.జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏ సీ ఎస్, డీసీఎంఎస్ విభాగాల ఆద్వర్యంలో ఇప్పటికే 246 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
సీసీఐ ఆద్వర్యంలో దాదాపు ఐదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు.వరి, పత్తి పండించిన రైతులు తమ పరిధిలోని కేంద్రాలకు పంట ఉత్పత్తులను తరలించాలని సూచించారు.







