అన్నకు చెల్లికాకుండా పోతుందా ? ఆ వివాదంపై స్పందించిన విజయమ్మ 

గత కొంతకాలంగా వైఎస్ షర్మిల ,( YS Sharmila ) జగన్( Jagan ) మధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదానికి సంబంధించి రకరకాల కథనాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.ఈ ఆస్తుల వ్యవహారంలో జగన్ ను టార్గెట్ వేసుకుని ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు .

 Ys Vijayamma Reacts On Jagan Sharmila Issues Details, Ys Sharmila,ys Jagan, Ys V-TeluguStop.com

ఇక టిడిపి అనుకూల మీడియాలోనూ జగన్ కు వ్యతిరేకంగా అనేక కథనాలు వెలువడుతున్నాయి.ఆస్తికోసం సొంత తల్లి , చెల్లి పై జగన్ కేసులు వేశారని,  విజయమ్మ,( Vijayamma )  షర్మిల ప్రాణాలకు కూడా జగన్ నుంచి ముప్పు ఉందనే విధంగా ప్రచారాలు చేస్తున్నారు.

  జగన్ వైఖరి కారణంగానే విజయమ్మ షర్మిల వద్ద ఉంటున్నారని,  తల్లిని కూడా జగన్ గెంటివేసారనే ప్రచారం జరుగుతూ ఉంది .ఇక కొద్దిరోజుల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు పాడవడం పైన జగన్ ను టార్గెట్ చేసుకుని అనేక కథనాలు వెలువడ్డాయి.

Telugu Ap, Jagansharmila, Telugudesam, Vijayamma, Ys Jagan, Ys Sharmila, Ys Vija

ఇక సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్ర ప్రచారం జరిగింది.వైఎస్ విజయమ్మ కారు పాడైన ఘటన ను కుట్ర కోణంగా అనుమానిస్తూ జగన్ పైన అనేక ప్రచారాలు జరిగాయి .తాజాగా ఈ వ్యవహారాలపై వైఎస్ విజయమ్మ స్పందిస్తూ వీడియోలను విడుదల చేశారు.గత కొద్దిరోజులుగా తన వాహనం పాడైపోయిన ఘటనకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టే విధంగా విజయమ్మ వీడియో విడుదల చేశారు.అందులో అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు.” నా వాహనం పాడైతే దానిని ఏదో ఘటనకు ముడిపెట్టారు.నేను నా మనవడి దగ్గరకు వెళ్తే మరో విధంగా ప్రచారం చేస్తున్నారు.ఏ ఇంట్లో అయినా అభిప్రాయ బేధాలు ఉంటాయి.వ్యక్తుల మధ్య భిన్న అభిప్రాయాలు ఉంటాయి.దానిని గౌరవించాలి.

Telugu Ap, Jagansharmila, Telugudesam, Vijayamma, Ys Jagan, Ys Sharmila, Ys Vija

ఆస్తుల విషయంలో షర్మిల,  జగన్ మధ్య విభేదాలు ఉన్నది వాస్తవం.అవి మీ కుటుంబాలలో జరగడం లేదా ?  అలాంటిది మీ కుటుంబాలలో చోటు చేసుకోవడం లేదా ? దీనిని భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తారు.వ్యక్తిత్వ హనానికి ఎందుకు పాల్పడతారు.మీడియా వార్తలు రాస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  ఎలాంటి వార్తలు రాస్తున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి.ఇష్టను సారంగా ఎదుట వ్యక్తుల జీవితాలను నాశనం చేయవద్దు.

వారి జీవితాలను ప్రభావితం చేసే విధంగా వార్తలను రాయకూడదు.  ఇటీవల నా వాహనం పాడైపోయిన ఘటనకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పుడు నేనే లేఖ రాశాను.

ఆ లేక ఫోర్జరీ కాదు.అందులో ఉన్న సంతకం కూడా నాదే .దీనిపైన రకరకాల వక్రీకరణలు చేస్తున్నారు ఇది సరైన చర్య కాదు ” ఉంటూ విజయమ్మ వీడియోలో వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube