పీకన్ న‌ట్స్ గురించి ఇవి తెలిస్తే తిన‌కుండా ఉండ‌లేర‌ట‌!

న‌ట్స్‌లో ఎన్నో ర‌కాలు ఉండ‌గా.అందులో పీక‌న్ న‌ట్స్ కూడా ఒక‌టి.

 Amazing Health Benefits Of Pecan Nuts! Health, Benefits Of Pecan Nuts, Pecan Nut-TeluguStop.com

చూసేందుకు వాల్ న‌ట్స్ మాదిరిగానే ఉండే పీక‌న్ న‌ట్స్ రుచిగా ఉండ‌ట‌మే కాదు.ప్రోటీన్‌, పైబ‌ర్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఇలా ఎన్నో పోషక విలువ‌ల‌ను సైతం క‌లిగి ఉంటాయి.

అందుకే పీక‌న్ న‌ట్స్ గురించి తెలుసుకుంటే తిన‌కుండా ఉండ‌లేర‌ని అంటుంటారు.మ‌రి ఆల‌స్య‌మెందుకు పీక‌న్ న‌ట్స్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

రోజుకు గుప్పెడు చ‌ప్పున పీకన్ న‌ట్స్ తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా మార‌తాయి.కీళ్ల నొప్పులు, కండ‌రాల నొప్పులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఆర్థ‌రైటిస్ బాధితులు పీక‌న్ న‌ట్స్ తింటే ఎంతో మంచిది.అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ల‌క్ష‌ణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉండ‌టం వ‌ల్ల పీక‌న్ న‌ట్స్‌ను రోజూ తీసుకుంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

దాంతో సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ప్ర‌తి రోజు పీక‌న్ న‌ట్స్‌ను త‌గిన మోతాదులో తీసుకుంటే.

అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచి హార్ట్ ఎటాక్ మ‌రియు ఇత‌ర హార్ట్ సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా అడ్డు క‌ట్ట వేస్తాయి.చెడు కొలెస్ట్రాల్ క‌రిగి పోతుంది.

అదే స‌మ‌యంలో అధిక ర‌క్త పోటు స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

అంతే కాదు, పీక‌న్ న‌ట్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే గ‌నుక శ‌రీర బ‌రువు అదుపులో ఉంటుంది.చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతి వంతంగా మెరిసి పోతుంది.జుట్టు రాల‌డం, చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

మ‌రియు మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారి జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube