నేహా అరోరా అనే ఇండియన్ కంటెంట్ క్రియేటర్ జాంగ్‌సూ లీ(Jongsoo Lee) అనే కొరియన్(Korean) వ్యక్తిని వివాహం చేసుకుంది.వారి రోజువారీ జీవితంలోని అందమైన క్షణాలను “కే-డ్రామా విత్ దేసి తఢ్కా”(K-drama with desi tadka) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ప్రజలతో పంచుకుంటుంది.
తాజాగా దంపతులు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో నేహా తన భర్త జాంగ్‌సూ లీ హిందీ నైపుణ్యాలను పరీక్షించాలని నిర్ణయించుకుంది.
కెమెరాను తన చేతిలో పట్టుకొని, “లెట్స్ చెక్ మై హస్బెండ్స్ హిందీ స్కిల్స్” అని చెప్పింది.ఆ తర్వాత తమ బిడ్డను చేత్తో పట్టుకున్న జాంగ్‌సూ వైపు తిరిగి, వివిధ వస్తువుల చిత్రాలను చూపిస్తూ వాటికి హిందీలో పేరు చెప్పమని అడిగింది.
నేహా(Neha) తన భర్త జాంగ్‌సూ లీ హిందీ నైపుణ్యాలను పరీక్షించడంలో భాగంగా ఒక చెంచా ఫోటో చూపిస్తే, అతను “చమ్చా” అని చెప్పాడు.ఆ తర్వాత చెప్పుల ఫోటో చూపించగా, జాంగ్‌సూ లీ(Jongsoo Lee) ఒక పెద్ద చిరునవ్వుతో “యే బిల్కుల్ ఆసాన్, తప్పడ్!” అని సమాధానం ఇచ్చాడు.ఆశ్చర్యపోయిన నేహా “తప్పడ్?” అని అడిగితే, జాంగ్‌సూ లీ కాన్ఫిడెంట్ గా తల వూపిస్తూ “తప్పడ్ విత్ చప్పల్” అని వివరించాడు.అంటే చెప్పులతో దెబ్బ అని సరదాగా అన్నాడు.
ఆ రెండు పదాల ఉచ్చరణ ఒకేలాగా ఉండటంతో భారతీయ భార్య ఆశ్చర్యపోయింది.
నేహా ఒక దోమ ఫోటో చూపించగా, జాంగ్‌సూ లీ ఏమాత్రం ఆలోచించకుండా “ఐ నో, ఐ నో! షీ ఇస్ లైక్ యు, నా? మచ్చర్” అని అన్నాడు.ఈ విధంగా ప్రతి సమాధానం ఇంకా ఫన్నీగా మారింది.జాంగ్‌సూ లీ హిందీని(Hindi) నేర్చుకునే విధానం చాలా హాస్యంగా ఉంది, వీడియోను చాలా ఫన్నీగా మార్చింది.
ఈ వీడియోను మిలియన్ల కొద్దీ మంది చూశారు.చాలా మంది యూజర్లు ఇది ఎంత ఫన్నీగా ఉందో కామెంట్ చేశారు.
ఒక యూజర్ “ఉపర్ పంఖా చల్తా హై, నీచే బేబీ సోతా హై (పైన ఫ్యాన్ తిరుగుతోంది కింద బిడ్డ నిద్రిస్తోంది)’ అని చెప్పడం కూడా మీ భర్తకు తెలుసు అనుకుంటా” అని రాశారు.మరొకరు “చప్పల్ విత్ తప్పడ్ హా? అమేజింగ్ రైమింగ్” అని జోడించారు.చాలామంది బాగా నవ్వుకున్నారు కూడా.