వైట్ అండ్ బ్రైట్ స్కిన్ కోసం ఆరాటపడుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసమే!

Simple Tip For White And Bright Skin! Simple Tip, Skin Whitening, Skin Brightening, Glowing Skin, Latest News, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips

తమ ముఖ చర్మం వైట్ అండ్ బ్రైట్ గా మెరిసిపోవాలని చాలా మంది తెగ ఆరాటపడుతూ ఉంటారు.అందులోనూ ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉందంటే చర్మాన్ని మెరిపించుకోవడం కోసం ఇంకా తాపత్రయపడుతుంటారు.

 Simple Tip For White And Bright Skin! Simple Tip, Skin Whitening, Skin Brighteni-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే తోచిన చిట్కాలు అన్నీ పాటిస్తుంటారు.ఇంకొంద‌రు వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి బ్యూటీ పార్ల‌ర్‌లో ఫేషియ‌ల్ చేయించుకుంటారు.

ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే తప్పకుండా మీరు ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటించాల్సిందే.

ఈ చిట్కాను పాటించడం వల్ల స‌హ‌జంగానే చ‌ర్మం తెల్ల‌గా మ‌రియు కాంతివంతంగా మారుతుంది.అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలు సైతం ల‌భిస్తాయి.ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అనేది లేట్ చేయకుండా ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక టమాటో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అర కప్పు కొబ్బరి ముక్కలు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్‌ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ట‌మాటో, కొబ్బ‌రి జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ వెజిటేబుల్ గ్లిజ‌రిన్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ ఈ మిశ్రమాన్ని దూది సహాయంతో ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.అరగంట అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.చర్మంపై మొండి మచ్చలు ఉంటే దూరం అవుతాయి.మొటిమలు చాలా త్వరగా తగ్గు ముఖం పడతాయి.మరియు చర్మం షైనీగా సైతం మెరుస్తుంది.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ చిట్కాను పాటించేందుకు ప్ర‌య‌త్నించండి.

Video : Simple Tip For White And Bright Skin! Simple Tip, Skin Whitening, Skin Brightening, Glowing Skin, Latest News, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips #TeluguStopVideo

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube