తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గవర్నర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనిమిస్తున్నాయి.
సోషల్ మీడియాలో గెట్ అవుట్ రవి హ్యాష్ ట్యాగ్ తో గవర్నర్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.దీంతో గెట్ అవుట్ రవి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలి రోజున సభ నుంచి రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వ ప్రసంగాన్ని పలు చోట్ల విస్మరించడంతో పాటు ద్రవిడ దిగ్గజాల పేర్లను ఆయన ప్రస్తావించకపోవడం, తమిళనాడు పేరు మార్చాలని గవర్నర్ వ్యాఖ్యనించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.







