ప్రస్తుత చలికాలంలో సహజంగానే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.దీని కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అలాగే చలిపులి కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు సైతం తీవ్రంగా సతమతం చేస్తుంటాయి.అయితే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ డీటాక్స్ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే చలికాలంలో మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డీటాక్స్ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి, ఒక గ్లాసు బాదం పాలు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా మన మిరాకిల్ డీటాక్స్ స్మూతీ సిద్దమవుతుంది.ప్రస్తుత చలికాలంలో రోజుకు ఒకసారి ఈ స్మూతీని తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు దగ్గు శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది.చలి పులిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.వెయిట్ లాస్ అవుతారు.
ఆస్తమా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
మరియు రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.కాబట్టి చలికాలంలో ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలి అని భావించేవారు తప్పకుండా ఈ మిరాకిల్ డిటాక్స్ స్మూతీ ని డైట్ లో చేర్చుకోండి.