టాలీవుడ్ పాన్ ఇండియా హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్(ram charan, JR.Ntr) ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరూ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చెర్రీ తారక్ లు ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు తెలిసింది.ఇక ఈ సినిమా తర్వాత చాలామంది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో వార్ లకు కూడా దిగిన విషయం తెలిసిందే.
కానీ ఇద్దరు హీరోలు మాత్రం మీ ఇద్దరం సమానమే అని చెప్పుకుంటున్నారు.
రాజమౌళితో (Rajamouli)పాన్ ఇండియా హిట్ కొట్టాక రామ్ చరణ్ ఏకంగా ఎస్.శంకర్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు.అలా గేమ్ ఛేంజర్ (game changer)మొదలై ఇప్పుడు రిలీజ్ దశకు చేరుకుంది.
ఇదిలా ఉండగానే చరణ్ కంటే వేగంగా పావులు కదిపాడు తారక్.అతడు తన కంఫర్ట్ జోన్ లో ఉండే స్నేహితుడు కొరటాల శివకు(Koratala Shiva) అవకాశం కల్పించాడు.
తారక్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన దేవర (Devara )అనూహ్యంగా పాన్ ఇండియా హిట్ కొట్టింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లు వసూలు చేసి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చింది.
ఇక ఇదే ఉత్సాహంలో తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్ దీనికోసం సహకరించింది.అయితే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆలోచనలు, ఎంపికలు మాత్రం తారక్ కంటే భిన్నంగా ఉన్నాయి.చెర్రీ భారీ శంకర్ ని పూర్తిగా నమ్ముకున్నాడు.
ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్, దిల్ రాజు(Dil Raju)పై నమ్మకం ఉంచి గేమ్ ఛేంజర్ తన రేంజును పెంచుతుందని విశ్వసిస్తున్నాడు.ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో చరణ్ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్షన్ గా మారింది.
ఈ సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్, చరణ్(NTR, ram charan) ఇద్దరూ సమానమే అని చెప్పాలి.ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయితే గనుక ఈ విషయంలో తారక్ గ్రేట్ అని చెప్పాలి.
ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ కోసం చెర్రీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ మధ్యకాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్లను విడుదల చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు మూవీ మేకర్స్.