ప్రస్తుతం టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు అనే సంగతి తెలిసిందే.పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి.
బాలయ్య గత మూడు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలవగా బాబీ మూవీ హిట్ గా నిలిస్తే బాలయ్య ఖాతాలో అరుదైన ఘనత చేరుతుందని చెప్పవచ్చు.
గత 30 సంవత్సరాలలో బాలయ్య నటించిన నాలుగు సినిమాలు వరుసగా సక్సెస్ సాధించిన సందర్భాలు అయితే లేవు.
అయితే బాలయ్య ,బాబీ( Balayya, Bobby ) మూవీ సక్సెస్ సాధిస్తే బాలయ్య ఖాతాలో ఈ ఘనత చేరే అవకాశాలు అయితే ఉంటాయి.బాలయ్య ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
బాలయ్యకు క్రేజ్ మాత్రం గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరుగుతోంది.

బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్4 ( Unstoppable Season 4 )కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.సూర్య ఈ షోకు గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ మరికొన్ని రోజుల్లో ప్రసారం కానుంది.రాబోయే రోజుల్లో చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఈ షోకు హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
నాగార్జున, తారక్, కళ్యాణ్ రామ్ కూడా ఈ షోకు హాజరైతే బాగుంటుందని చెప్పవచ్చు.

బాలయ్య క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ అద్భుతంగా ఉండగా కథల ఎంపికలో బాలయ్య అసలు రాజీ పడటం లేదు.బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.35 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బాలయ్య సినిమాల డిజిటల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి.బాలయ్య బాబీ మూవీ డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.