మన శరీరంలో కిడ్నీ( Kidneys ) అతి ముఖ్యమైన అవయవం అని దాదాపు చాలా మందికి తెలుసు.ఇవి రోజంతా నాన్ స్టాప్ గా పని చేస్తూ ఉంటాయి.
అలాగే మూత్ర పిండాలు మన శరీరం నుంచి విషాన్ని ఫిల్టర్ చేయడానికి అలాగే మూత్రం ద్వారా విసర్జించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.కిడ్నీలు శుభ్రపరిచే పనిని చేస్తాయి.
కాబట్టి అవి త్వరగా సమస్యలకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.ఒక వ్యక్తి తగినంత నీరు తాగకపోతే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, ఉబాకాయం, ధూమపానం కూడా మూత్ర పిండాలను దెబ్బ తిసే ప్రమాదాన్ని పెంచుతాయి.అలాగే మూత్ర పిండాల వ్యాధులు అభివృద్ధి చెందుతాయి.
అలాగే కుటుంబంలో ఎవరికైనా ఆ మూత్ర పిండాల సమస్యలు( Kidney Problems ) ఉంటే వారికి కూడా కిడ్నీల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కిడ్నీలకు సంబంధించిన సమస్య ఉంటే వాటి గురించి మనకు తెలియజేయడానికి మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది.
కిడ్నీలలో ఏదైనా సమస్య ఉంటే మొహం లో, కళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

కిడ్నీ వ్యాధి ఉంటే కళ్లలో( Eyes ) ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.కిడ్నీ సమస్యలకు కంటి చూపు మొదటి సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.మూత్రపిండాలు అదనపు ద్రవాలను సరిగా బయటకు పంపలేనప్పుడు ఆ ద్రవాలు కళ్ల చుట్టూ పెరిగిపోతాయి.
అలాగే వాపుకు కూడా కారణం అవుతాయి.అటువంటి కంటి వాపు నిరంతరంగా లేదా తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
అలాగే కంటి కింద నల్లటి వలయాలు( Dark Circles ) తగినంత నిద్ర లేకపోవడం వల్ల మాత్రమే కాకుండా మూత్రపిండాల సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు.

ఈ సందర్భంలో కూడా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.అలాగే మీ చర్మం రంగు సాధారణం కంటే పసుపు లేదా లేతగా కనిపిస్తే మీ కిడ్నీలలో సమస్య ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.కిడ్నీలు సరిగా పని చేయనప్పుడు చర్మంలో టాక్సిన్స్( Toxins ) పేరుకుపోయినప్పుడు చర్మపురంగు మారుతుంది.
మీరు మీ చర్మం రంగులో ఏదైనా సాధారణ మార్పులను గమనించినట్లయితే వైద్యులను సంప్రదించాలి.బలహీనమైన మూత్ర పిండాల పనితీరు చర్మం పొడిబారడం, దురద, శరీరం హైడ్రేషన్, ఎలెక్ట్రోలైట్స్‌లో అసమతుల్యతను కలిగిస్తుంది.