యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )రాజకీయాలకు, పొలిటికల్ ప్రచారానికి దూరంగా ఉన్నా రాజకీయాలు మాత్రం తారక్ కు దూరం కాలేదు.ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ గురించి కామెంట్ చేస్తారా అనే చర్చ జోరుగా జరుగుతోంది.తారక్ రాజకీయాల్లోకి వస్తే తమ సపోర్ట్ పూర్తిస్థాయిలో ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు కొంతమంది టీడీపీ కార్యకర్తలు( TDP workers ) సైతం చెబుతుండటం గమనార్హం.
తారక్ ఇలాంటి టైమ్ లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం రాష్ట్రం షేక్ అయిపోద్ది అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాలను( AP politics ) ప్రభావితం చేసే సత్తా ఉన్న రాజకీయ నాయకుడు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం గోవాలో దేవర ( Devara )షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
మాస్ సినిమాలతో భారీ విజయాలను అందుకుంటున్న తారక్ దేవర సినిమా కోసం తెగ కష్టపడుతున్నారని తెలుస్తోంది.సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ మరో ఐదేళ్ల తర్వాత పాలిటిక్స్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ మాత్రం ప్రస్తుతం పూర్తిస్థాయిలో సినిమలపై ఉందని సమాచారం అందుతోంది.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )కాంబో మూవీ, హృతిక్ ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ తను హీరోగా తెరకెక్కే ప్రతి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.ఎన్టీఆర్ వయస్సు ప్రస్తుతం 40 సంవత్సరాలు కాగా సరైన సమయంలో తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ అంశాల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.