సినిమా ఇండస్ట్రీ కి ఎంతో మంది గాయనీమణులు వస్తున్నారు పోతున్నారు.ఎవరికైనా బాగా గుర్తున్న పాత తరం సింగర్ పేరు చెప్పమంటే సుశీల, జానకి, చిత్ర అని చెప్తూ పోతారు కానీ 83 ఏళ్ళ వయసున్న ఎల్ ఆర్ ఈశ్వరి పేరు ఎవరికి గుర్తు లేదు.
మొన్న ఎనిమిదో తారీఖున ఆమె పుట్టిన రోజు కూడా జరిగింది.కానీ ఒక్క మీడియా ఆమె పైన ఎలాంటి వార్త వేయలేదు.
సోషల్ మీడియా కూడా పట్టించుకుననట్టు లేదు.తెలుగు, తమిళ, మలయాళం, తులు వంటి 14 భాషల్లో కొన్ని వేళా పాటలు పాడింది.
ఆమె కెరీర్ లో ఎన్నో మరుపురాని గీతాలు ఉన్నాయ్.నిన్నటికి నిన్న శృంగార నర్తకి జయమాలిని తనకు ఇష్టమైన పాట ఏది అంటే సన్నజాజులోయ్ అంటూ చెప్పింది.
ఆ పాట రాసింది వేటూరి.పాడింది ఎల్ ఆర్ ఈశ్వరి.
అసలు ఎలాంటి సాహిత్య విలువలు లేని ఒక పాట కేవలం ఈశ్వరి పాడిన కారణంగా సగం మేర హిట్ అయింది అని చెప్పుకోవచ్చు.అలంటి ఎన్నో వేళా పాటలు పడిన ఆమె నేపధ్యం విషయానికి వస్తే పుట్టింది పెరిగింది అంత కూడా మద్రాసులో.
కాథలిక్ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది.ఈశ్వరి అసలు పేరు లూర్డ్ మేరీ.
ఆ తర్వాత తన బామ్మా కోసం లూర్డ్ రాజేశ్వరి అని పేరు మార్చుకుంది.ఆ తర్వాత లూర్డ్ ఈశ్వరి గా మారింది.
ఎలాంటి సంగీత నేపథ్యం లేని ఈశ్వరి గొంతు ఎంతో చక్కగా ఉండటం తో కె వి మహదేవన్ ఆమెకు మొదటి అవకాశం ఇచ్చాడు.ఆమె కెరీర్ మొత్తం క్లబ్ సాంగ్స్, శృంగార గీతాలకే అంకితం అయ్యింది.
సంగీతం తెలియకపోవడం ఇందుకు ఒక కారణం కావచ్చు.

అలాగే ఆమె గొంతులో ఒక భిన్నమైన తీరు ఉండటం మరొక కారణం అవ్వచ్చు.ఆమె పాడిన అనేక పాటలకు సిల్క్ స్మిత, జయమాలిని, జ్యోతి లక్ష్మి వంటి వారు నర్థించేవారు.ఇక సింగర్ గా బిజీ గా ఉన్న డబ్బింగ్ కూడా చెప్పింది.
చాల ఏళ్ళ క్రితమే రిటైర్మెంట్ కూడా తీసుకుంది.ఆమెకు నేటి వరకు ఎలాంటి ప్రసంశలు కానీ అవార్డులు, రివార్డులు ఎవరు ప్రకటించలేదు.
కెరీర్ లో మాత్రమే కాదు కుటుంబం కోసం కూడా ఎన్నో త్యాగాలు చేసింది.కేవలం కుటుంబాన్ని పోషించడం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగానే ఉంది.