పెళ్లయిన వాడితో రిలేషన్ షిప్..సొంత తండ్రి పైన కేసు.. అమీషా పటేల్ జీవితం

Ameesha Patel Love Affairs And Controversies , Ameesha Patel, Love Affairs , Badri Movie, Mahesh Bhatt, Tollywood, Bollywood

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి.పెళ్లి వయసు వచ్చినప్పుడు చేసుకుంటేనే జీవితాల్లో అన్ని బంధాలు, బాధ్యతలు సక్రమంగా నెరవేర్చగలం.

 Ameesha Patel Love Affairs And Controversies , Ameesha Patel, Love Affairs , Ba-TeluguStop.com

పెళ్లి చేసుకోవాల్సిన వయసుకు వయసు మీరిన వాడితో రిలేషన్ లో ఉండి, ఆ తర్వాత అవసరం లేని వివాదాలు సృష్టించుకొని జీవితాంతం పెళ్లి కాకుండా మిగిలిపోయిన హీరోయిన్ అమీషా పటేల్.పవన్ కళ్యాణ్ బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన అమీషా పటేల్ బాలీవుడ్ లోనే తన కెరీర్ మొదలు పెట్టింది.

సినిమాల కన్నా కూడా ఎక్కువగా అఫైర్స్ తోనే వార్తల్లో ఉండేది ఈ అమ్మడు.

అమీషా పటేల్ తన పాతికేళ్ల ప్రాయం లో తన వయసులో డబల్ ఉండే మహేష్ భట్ తో ప్రేమలో పడింది.

మహేష్ భట్ అంటే మరెవరో కాదు హీరోయిన్ అలియా భట్ తండ్రి.అప్పటికే పెళ్ళై ఎంతో మందితో అఫైర్స్ ఉన్న మహేష్ కి అమీషా పటేల్ వంటి హీరోయిన్స్ తో ప్రేమాయణం సాగించడం కొత్తేమి కాదు.

కేవలం అవకాశాల కోసం అమీషా అతడితో లవ్వాట ఆడింది అని కొంత మంది అంటే మహేష్ భట్ లో మాయలో పడిన మరొక హీరోయిన్ అమీషా అని మరికొంత మంది అనేవారు.ఏది ఏమైనా వీరి ప్రేమ వల్ల అమీషా కెరీర్ పెద్దగా వెలిగిపోయిందేమి లేదు.

మహేష్ తో ఉండటం వల్ల చివరికి సొంత తండ్రి పైన కూడా కేసు పెట్టింది.

Telugu Ameesha Patel, Badri, Bollywood, Love Affairs, Mahesh Bhatt, Tollywood-Te

ఒకానొక సమయంలో అమీషా డబ్బుల వ్యవహారాలు అన్ని కూడా ఆమె తండ్రి దగ్గర ఉండి చూసుకునే వాడు.అయితే ఆమె సంపాదించినా డబ్బును ఫామిలీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం తో అసలు గొడవ మొదలయ్యింది.తన డబ్బు కోసం ఏకంగా కుటుంబం పైన కేసు పెట్టింది.

ఆ తర్వాత కనవ్ పూరి అనే లండన్ వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో పడింది.రెండేళ్లు తిరక్కుండానే అతడితో ప్రేమకు స్వస్తి పలికింది.

ఇక చివరగా ఫామిలీ పైన పెట్టిన కేసును సైతం వెనక్కి తీసుకుంది.అందరి కలిసి మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube