ఒక మంచి టీచర్ వల్ల మన జీవితమే మారిపోతుందనడంలో సందేహం లేదు.పిల్లల జీవితంలో ఉపాధ్యాయులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
విద్యార్థులు తమ జీవితాంతం తమపై ప్రభావం చూపిన ఉపాధ్యాయులను గుర్తుంచుకుంటారు.ఒక ఫ్లైట్ అటెండెంట్ 30 సంవత్సరాల తర్వాత అదే విమానంలో తన అభిమాన ఉపాధ్యాయురాలిని చూసి భావోద్వేగానికి గురైంది.
తన చిన్నతనంలో తనను తీర్చిదిద్దిన టీచర్‌ను చూసి, ఆమె వల్ల తాను జీవితంలో ఎలా ఎదిగానో గుర్తు చేసుకుంది.నెటిజన్లను హత్తుకున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.అందులో ఓ ఫ్లైట్ అటెండెంట్ మైక్ తీసుకుని మాట్లాడుతుంది.
ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న మహిళ అదే విమానంలో తన టీచర్‌ను చూస్తుంది.ఆ తర్వాత మైక్ తీసుకుని ఇలా మాట్లాడుతుంది.“అందరికీ శుభోదయం.నేను మూడు నెలలుగా ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నాను.
ఈ రోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం.మన జీవితాలను మార్చిన ఉపాధ్యాయులను గుర్తించాలి” అని ఆ మహిళ చెబుతోంది.
ఆ మహిళ తన అభిమాన టీచర్ అదే విమానంలో ఉన్నారని తెలియజేస్తుంది.
ఆ తర్వాత ఆమె టీచర్ సీట్ వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకుంది.టీచర్ భావోద్వేగంతో, “మీరు నా భవిష్యత్తును తీర్చిదిద్దారని చాలా ఎమోషనల్‌గా చెబుతుంది.ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లతో 1.7 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.చాలా మంది ఈ వీడియోను చూసిన తర్వాాత భావోద్వేగానికి గురవుతున్నారు.
తమ జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను గుర్తు తెచ్చుకుంటున్నారు.పాఠాలను చెబుతూ, జీవిత పాఠాలను వివరిస్తూ తమను ఉన్నత శిఖరాలకు చేర్చిన గురువులను తలచుకుంటున్నారు.