పెళ్లి పీటలెక్కబోతున్న పవన్ హీరోయిన్ నికిషా పటేల్.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లలో నికిషా పటేల్ ఒకరు.తెలుగుతో పాటు తమిళ సినిమాలలో నికిషా పటేల్ ఎక్కువగా నటించారు.

 Heroine Nikisha Patel Marriage Fixed Details Here Goes Viral , Pawan Kalyan , Ko-TeluguStop.com

కొమరం పులి సినిమాతో నటిగా నికిషా పటేల్ కెరీర్ మొదలైంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద్ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత నికిషా పటేల్ పలు తెలుగు సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఈ మధ్య కాలంలో నికిషా పటేల్ కు ఆశించిన స్థాయిలో సినిమా ఆఫర్లు రావడం లేదు.

అయితే ఈ స్టార్ హీరోయిన్ పెళ్లిపై దృష్టి పెట్టారని సమచారం అందుతోంది.నికిషా పటేల్ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ విదేశాల్లో ఉన్నారు.సోషల్ మీడియాలో నికిషాకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా నికిషా పటేల్ తాను విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చారు.త్వరలో తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నానని ఆమె కామెంట్లు చేశారు.తన బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలను నికిషా పటేల్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.నికిషా పటేల్ షేర్ చేసిన పోస్ట్ కు 1000కు పైగా లైక్స్ వచ్చాయి.

నికిషా పటేల్ రాబోయే రోజుల్లో సినిమా రంగంలో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో చూడాల్సి ఉంది.

నికిషా పటేల్ భర్త బాగున్నాడని జోడీ అందంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.నికిషా పటేల్ పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.నికిషా పటేల్ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

కథల ఎంపికలో పొరపాట్ల వల్లే ఆమె సినిమాలు ఫ్లాప్ అయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube