కరోనా దెబ్బకు ప్రపంచం అంతా షట్ డౌన్ అయ్యింది.అన్ని రంగాలు మూతపడ్డాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్యాకప్ చెప్పాల్సి వచ్చింది.ఈ టైంలోనే కొందరు యువ దర్శకులు తమ ట్యాలెంట్ నిరూపించుకునేందుకు వేసిన అడుగులు సక్సెస్ అయ్యాయి.
లాక్ డౌన్ టైంలోనూ తన సినిమాలు రూపొందించారు.ఇండస్ట్రీకి డెబ్యూ డైరెక్టర్లుగా పరిచయం అయ్యారు.ఇంతకీ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన కొత్త దర్శకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
శైలేష్
విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే సినిమా తీశాడు శైలేష్ కొలను.ఈ సినిమాతో ఇండస్ట్రీకి డెబ్యూ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు.నానీ ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.
సందీప్ రాజ్
కలర్ ఫోటో సినిమాతో ఇండస్ట్రీలో కొత్త దర్శకుడిగా అడుగు పెట్టిన సందీప్ రాజ్.తొలి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు.స్నేహితుడు సుహాన్ ను హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా ఓటీటీలో రికార్డులు సృష్టించింది.
శ్రీకాంత్
నవీన్ చంద్ర హీరోగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో వచ్చిన సినిమా భానుమతీ రామకృష్ణ.డెబ్యూ డైరెక్టర్ గా శ్రీకాంత్ చేసిన తొలి మూవీనే ఆహా లో మంచి వ్యూస్ సాధించింది.దర్శకుడిగా మంచి ప్రతిభ చాటుకున్నాడు శ్రీకాంత్.
వినోద్ అనంతోజు
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్.వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.వినోద్ కు ఈ సినిమా తొలి చిత్రం కావడం విశేషం.
సుబ్బు
కరోనా లాక్ డౌన తర్వాత థియేటర్లలో విడుదల అయిన తొలి సినిమా సోలో బ్రతుకే సో బెటర్.ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మంచి రికార్డు సాధించింది.డైరెక్టర్ సుబ్బుకు మంచి పేరు తెచ్చింది.