తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంత మంది స్టార్ హీరోలుగా వెలిగిపోతుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతున్నారు.మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ లాంటి హీరోలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా ఇండస్ట్రీకి వచ్చి వీళ్ళ లాగా రాణించాలి అని అనుకున్నప్పటికీ అందరూ అలా ఎదగలేరు కదా 100 మందిలో పది మంది మాత్రమే ఇక్కడ హీరో గా సెట్ అవుతారు అందుకే ఇండస్ట్రీకి రావాలంటే ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు.
చిరంజీవితో ఆ టైం లో వచ్చిన చాలామంది హీరోలు ఫేడ్ అవుట్ అయిపోయారు కానీ చిరంజీవి గారు మాత్రమే తన సంకల్ప దీక్ష తో ఇండస్ట్రీలో తనదైన శైలిలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపును సాధించారు.
ప్రతి సంవత్సరం చాలా మంది హీరోలు వస్తుంటే దాంట్లో ఫెడ్ అవుట్ అయిపోయే హీరోల సంఖ్య ఎక్కువగా ఉంది అలాంటి హీరోలు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు 16 సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నాడు హీరో రోహిత్ ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.అలాగే నేను సీతా మహాలక్ష్మి అనే సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ముఖ్యంగా గజాల, రేఖ హీరోయిన్లుగా అంజి శీను డైరెక్షన్లో వచ్చిన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమా మంచి విజయాన్ని సాధించి తనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చింది.
అటు హీరోగా చేస్తూనే ప్రభుదేవా డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా MBBS సినిమాలో మంచి క్యారెక్టర్ ని పోషించాడు.అలాగే తరుణ్ హీరోగా వచ్చిన నవ వసంతం సినిమాలో తరుణ్ ఫ్రెండ్ గా ఒక మంచి క్యారెక్టర్ లో నటించి తనదైన నటనతో మంచి గుర్తింపును సాధించారు.ఇదిలా ఉంటే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో రోహిత్ చిన్నప్పటి విషయాలను చెబుతూ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చాలా బాధ్యతగా పెంచిందని కానీ వాళ్ల నాన్న అసలేం పట్టించుకునేవాడు కాదని ఆయన బాగా తాగడం వల్ల మేము రోడ్డున పడ్డామని చెప్పాడు.
అందుకే ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేవాడినని ఆ సమయంలోనే సినిమా అవకాశం రావడం వల్ల సినిమాల్లో నటించానని చెప్పాడు.సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపు సాధించినప్పటికీ ఆ ఫామ్ ని తను కొనసాగించలేకపోయాడు.
అప్పట్లో ఈయనతోపాటు ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి వారు స్టార్ హీరోగా గుర్తింపు పొందినప్పటికీ అనతికాలంలోనే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు.అయితే తన ఫేడ్ అవుట్ అయిపోయినప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు కానీ తను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మాయి దొరకడం కొంచెం ఇబ్బంది అయింది అయితే ఒక అమ్మాయిని చూసినప్పుడు నా గురించి పూర్తిగా చెప్పి నేను మళ్లీ సినిమాల్లో ప్రయత్నం చేస్తున్న అప్పటి వరకు మాత్రం నేను మనీ సంపాదించలేను అని చెప్పడంతో తను ఆలోచించి ఒక నెలరోజులు నాతో ట్రావెల్ అయి తర్వాత నా గురించి పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది.ఇక తన భార్యను ఒక పుస్తకం పై అచ్చు వేయగా అప్పుడే చూసి ప్రేమలో పడ్డానని, ఆమె నాకు భార్యగా రావాలని కళలు కన్నానని, కానీ నిజంగా ఆమె నా భాగస్వామి అవుతుంది అని ఊహించలేదు అంటూ తెలిపాడు రోహిత్.ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అని, మా ఇద్దరికీ పదేళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ ఆమె తనను ఎంతగానో అర్ధం చేసుకుంటుందని తెలిపాడు.
ప్రస్తుతం మాకు ఒక పాప కూడా ఉంది అని చెప్పారు.ప్రస్తుతానికి లైఫ్ ఇలా సాగుతుంది కానీ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి ఇంకా కొన్ని మంచి అవకాశాలను అందుకొని సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు సాధించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తను చెప్పుకొచ్చాడు.
ఏదేమైనా ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ తనని బాగా ఆదరించిందని చెప్పి మళ్ళీ ఇక్కడే మంచి గుర్తింపును సాధించాలని కూడా చెప్పాడు…
.