నోటి శుభ్రత శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.అందులో ఎటువంటి సందేహం లేదు.
నోటి ఆరోగ్యం, శరీర ఆరోగ్యం..
రెండూ ఒకదాంతో మరొకటి ముడిపడి ఉంటాయి.నోటి ఆరోగ్యం ఎప్పుడైతే గతి తప్పుతుందో.
అప్పటి నుంచీ దంత క్షయం, నోటి పుండ్లు, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం, దంతాలు కదలడం వంటి ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడతాయి.నోరు పరిశుభ్రంగా లేకపోతే శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, మతిమరపు వంటి అనేక సమస్యలు సైతం తలెత్తే అవకాశాలు ఉంటాయి.
అందుకే నోటి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సంరక్షించుకోవాలి.
అందుకు కేవలం బ్రష్ చేసుకుంటే సరిపోదు.
మౌత్ వాష్ కూడా ఎంతో ముఖ్యం.అయితే మౌత్ వాష్ కోసం మార్కెట్లో అనేక ప్రొడక్ట్స్ ఉన్నాయి.
వాటి వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే సహజ పద్ధతుల్లో మౌత్ వాష్ చేసుకుంటే అనేక నోటి సంబంధిత సమస్యలు పరార్ అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.

కొబ్బరి నూనె..మౌత్ వాష్‌కు సూపర్‌గా సహాయపడుతుంది.
బ్రష్ చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల వర్జిన్ కోకనట్ ఆయిల్ ను నోట్లో వేసి ఐదు నుండి పది నిమిషాల పాటు పుక్కలించాలి.ఆపై గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.
తద్వారా దంత క్షయం, నోటి పుండ్లు వంటివి దూరం అవుతాయి.

అలాగే మౌత్ వాష్ కు అలోవెర జెల్‌ను ఉపయోగించవచ్చు.కలబంద ఆకు నుండి జెల్‌ను సపరేట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో కొద్దిగా వాటర్ కలిపి.
మౌత్ వాష్ కోసం యూస్ చేయాలి.రోజూ బ్రష్ చేసుకున్నాక ఇలా చేస్తే చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటివి తగ్గుతాయి.
నోట్లో ఏమైనా బాక్టీరియా ఉన్నా.నాశనం అవుతుంది.

ఇక ఒక కప్పు వాటర్ లో ఐదు చుక్కల లవంగం నూనెను వేసి బాగా మిక్స్ చేయాలి.దీనిని నోట్లో వేసుకుని పుక్కలించి ఊయాలి.బ్రష్ చేసుకున్నాక ఈ విధంగా మౌత్ వాష్ చేసుకుంటే నోరు శుభ్రంగా మారుతుంది.దంతాలు, చిగుళ్లు దృఢంగా మారతాయి.దంత క్షయం దరి చేరకుండా ఉంటుంది.నోటి దర్వాసన నుంచి సైతం విముక్తి లభిస్తుంది.