మరో రెండ్రోజుల్లో అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఉన్న కాస్త సమయంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి.
అమెరికాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న భారతీయులు ఎటు వైపు మొగ్గు చూపుతారోనని విశ్లేషకులు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ( Raja Krishnamurthy )కీలక వ్యాఖ్యలు చేశారు.
స్వింగ్ స్టేట్స్ సహా దేశవ్యాప్తంగా భారతీయులు ప్రభావం చూపుతారని ఆయన అన్నారు.
భారతీయ అమెరికన్ కమ్యూనిటీ( Indian American Community ).భావజాలం కంటే ఆచరణాత్మక పరిష్కారాలపై దృష్టి సారించే నాయకులను ఇష్టపడుతుందని రాజా కృష్ణమూర్తి తెలిపారు.ఓ భారత జాతీయ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ.
మిచిగన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా వంటి కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని వెల్లడించారు.తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తారని రాజా కృష్ణమూర్తి చెప్పారు.

కాగా.ఇటీవల వెలువడిన ఓ సర్వేలో 61 శాతం మంది భారతీయ అమెరికన్లు కమలా హారిస్‌కు( Kamala Harris ) జై కొట్టగా.31 శాతం మంది ట్రంప్‌కు మద్ధతుగా నిలుస్తున్నారు.కార్నెగీ నిర్వహించిన ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే (ఐఏఏస్) 2024 ఫలితాలను సోమవారం విడుదల చేసింది.ఇందులో డెమొక్రాట్లకు ఆందోళన కలిగించే అంశాలను కూడా పేర్కొన్నారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు 68 శాతం మంది భారతీయ అమెరికన్లు మద్ధతు పలకగా.ఇది కమలా హారిస్‌కు వచ్చేసరికి 61 శాతానికి పడిపోయింది.ఇదే సమయంలో నాలుగేళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) 22 శాతం మంది ప్రవాస భారతీయులు జైకొట్టగా.
అది ఇప్పుడు 31 శాతానికి చేరుకుంది.డెమొక్రాట్ మద్ధతుదారులుగా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ అమెరికన్లు 56 శాతం నుంచి 47 శాతానికి.డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపే భారతీయుల సంఖ్య 66 శాతం నుంచి 57 శాతానికి పడిపోయింది.

అలాగే 40 ఏళ్ల లోపు వయసున్న భారతీయ అమెరికన్ పురుషులలో 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలుకుతుండగా .కమలా హారిస్‌కు కేవలం 44 శాతం మందే జై కొడుతున్నారు.భారతీయ వలసదారులతో పోలిస్తే.
అమెరికాలో పుట్టిన భారత సంతతిలో ట్రంప్‌కు మద్ధతు పలికే వారి సంఖ్య ఎక్కువగా ఉందని నివేదిక చెబుతోంది.







