సినిమా డైలాగ్స్ మొత్తం ఒకే షాట్ లో చెప్పేసిన ఎన్టీఆర్

ఎన్టీఆర్.తెలుగు సినిమా పరిశ్రమకు ఓ దిక్చూచి అని చెప్పుకోవచ్చు.

 Surprising Facts About Sr Ntr, Sr Ntr, Kodambakkam High Road In Madras, Pappaji,-TeluguStop.com

ఆయన తనలోని నటనా విశ్వరూపంతో ఎన్నో అద్భుత సినిమాల్లో యాక్ట్ చేశారు.ఆయన కెరీర్ తొలినాళ్లలో ఓ విచిత్ర ఘటన జరిగింది.

ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అప్పట్లో ఒక గ్రీన్ క‌ల‌ర్ మోరిస్ మైన‌ర్ కారు మద్రాసులోని కోడంబాకం హైరోడ్డులోని ఒక ఇంటి గుమ్మానికి దగ్గర ఆగింది.

అందులో నుంచి ఓ యువకుడు పంచెకట్టు, లాల్చీతో దిగాడు. ఇంటిలోపలికి వచ్చాడు.

అక్కడే ఉన్న ఓ చిన్న పర్ణశాలలోకి వెళ్లాడు… అక్కడే ఉన్న ఆఫీస్ ఇన్చార్జ్ తో పప్పాజీ ఉన్నాడా? అని అడిగాడు.ఉన్నాడు.

కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్లాడు ఆ వ్యక్తి.

కొద్ది సేపటి తర్వాత పప్పాజీ వచ్చాడు.

ఆయనతో పాటు స్వామీజీ కూడా వచ్చాడు.పప్పాజీ అంటే మరెవరో కాదు.

తెలుగు సినిమా పితామహుడు హెచ్‌.ఎం.రెడ్డి.స్వామీజీ అంటే ఆయన కొడుకు వై.ఆర్‌.స్వామి.

అంతేకాదు.వ‌ద్దంటే డ‌బ్బు సినిమా దర్శకుడు.

వచ్చిన ఆ వ్యక్తి ఎన్టీఆర్.విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాల్లో మాత్ర‌మే న‌టించాల‌న్న అగ్రిమెంట్ త‌ర్వాత‌… ఇత‌ర నిర్మాత‌ల సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్న ఫస్ట్ మూవీ వద్దంటే డబ్బు.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి డైలాగ్స్ ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఫైలులో ఉన్నాయి.ఆ డైలాగ్స్ స‌దాశివ బ్ర‌హ్మం అనే రచయిత రాశాడు.

Telugu Kodambakkamroad, Pappaji, Sr Ntr, Tollywood, Vaddante Dabbu, Vijaya, Yr S

కొద్ది సేపటి తర్వాత.ప‌ప్పాజీ.మీరు పంపిన స్క్రిప్టు చదివాను.

కాసేపు మీరు ఉంటానంటే నా డైలాగులు మీకు వినిపిస్తాను అని చెప్పాడు.ఆ తర్వాత మీకు ఏదైనా మార్చాలి అనిపిస్తే మార్చవచ్చు అన్నాడు.

సరే అన్నాడు పప్పాజీ.ఎన్టీఆర్ ఆయన డైలాగులను తన నటతో మేళవించి వినిపించాడు.

ఆయన అమోఘ నటన, మేధస్సు పట్ల పప్పాజీ ఆశ్చర్యపోయాడు.అటు సినిమా షూటింగ్ 30 రోజుల పాటు కొనసాగింది.

ప్రతిరోజు సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 2 గంట‌ల దాకా ఆ సినిమా షూటింగ్‌ జరిగేది.మొత్తంగా ఈ సినిమా విడుదలై.

ఘన విజయం సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube