సాధారణంగా సీజన్ మారుతున్న రోజులలో జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఈ సీజన్ లో ఫిట్ గా ఉండాలంటే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
దీని కోసం మారుతున్న కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి సిజనల్ ఫ్రూట్స్, కూరగాయలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అదే సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుర్వేద ఆహారాలు తినాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో పొడి దగ్గుతో చాలా మంది బాధపడుతున్నారు.

రాత్రి పూట నిద్ర పట్టడం లేదని చాలా మంది చెబుతున్నారు.దాని నుంచి విముక్తి పొందాలి అనుకుంటే ఈ నియమాలను పాటించడం మంచిది.పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందాలనుకుంటే లికోరైస్ తినవచ్చు.
ఇది పొడి దగ్గుతో బాధపడే వారికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది.నోటిలో ఒక చిన్న లికోరైస్ ముక్కను నమిలితే పొడి దగ్గు దూరమైపోతుంది.
అంతేకాకుండా లికోరైస్ స్టిక్ వేసి తినవచ్చు.ఫలితాల కోసం దీన్ని రోజుకు రెండు నుంచి మూడుసార్లు ఉపయోగించవచ్చు.
అయితే గర్భిణీ స్త్రీలు అధిక రక్తపోటు ఉన్న వారు తినకూడదు.తేనె లో లికోరైస్ పౌడర్ మిక్స్ చేసి లిక్కర్ గా తీసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే తులసిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని దాదాపు చాలామందికి తెలుసు.దగ్గు తగ్గించడంలో దానిలో అనేక లక్షణాలు ఉంటాయి.పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి తులసి ఆకును కూడా తినవచ్చు.దీన్ని తీసుకోవడం వల్ల పొడి దగ్గు తగ్గుతుంది.ఇందుకోసం కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి టీ లాగా కూడా త్రాగవచ్చు.తులసి టీ నీ రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి.
అలాగే తులసి ఆకులతో కాశయం తయారు చేసుకొని కూడా తీసుకోవచ్చు.







