హత్యకు కుట్ర పన్నిన కేసులో అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన భారత సంతతికి చెందిన నేత రాజ్‌వీర్ సింగ్ గిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.గత వీకెండ్‌లో బేకర్స్‌ఫీల్డ్‌లోని అతిపెద్ద గురుద్వారా షహీద్ బాబా దీప్ సింగ్ జీ ఖల్సా దర్బార్ సభ్యులను కాల్చిచంపడానికి షూటర్లను నియమించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బేకర్స్‌ఫీల్డ్ అనేది కాలిఫోర్నియా రాష్ట్రంలోని కెర్న్ కౌంటీలోని ఒక నగరం.గిల్‌పై పోలీసులు ఆరు నేరారోపణలు మోపారు.
అయితే ఆయనను తర్వాత విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
గతేడాది నవంబర్‌లో జరిగిన వార్డు ఎన్నికల్లో పోటీ చేసిన గిల్ 7 శాతానికిపైగా ఓట్లను సాధించారు.
అయితే ఇటీవలి కాలంలో గురుద్వారా వద్ద రాజ్‌వీర్ సింగ్ పలుమార్లు కనిపించారని , ప్రార్థనలకు అంతరాయం కలిగించాడని, కమ్యూనిటీ మెంబర్లను బెదిరించాడని గురుద్వారా పెద్ద మీడియాకు తెలిపారు.అంతేకాకుండా పోలీసులు అతనిని అరెస్ట్ చేయడానికి ముందు కూడా తుపాకీని వెంటే వుంచుకున్నాడని తెలుస్తోంది.

దీని అంతటికి కారణం గురుద్వారాను జప్తు చేయడమేనని తెలుస్తోంది.జూలై 2020లో గురుద్వారాను జప్తు చేయడం , కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థకు చెల్లించాల్సిన 8,00,000 అమెరికన్ డాలర్లకు సంబంధించి కమ్యూనిటీ సభ్యుల మధ్య పదే పదే ఘర్షణలు చోటు చేసుకున్నాయి.అయితే గిల్ అత్యాశే అనర్థాలకు కారణమైందని కొందరు ఆరోపిస్తున్నారు.సిక్కు పెద్ద రాంఘీ చెబుతున్న దాని ప్రకారం.కోర్టు కేసుల్లో వున్న కొందరు నేతలను చంపడానికి గిల్ ఇద్దరు షూటర్లకు 10,000 అమెరికన్ డాలర్లను ముట్టజెప్పాడు.దీనిలో భాగంగా ఎవరిని హత్య చేయాలనే దాని కోసం ఆలయానికి చెందిన నేతల ఇళ్లను వారికి గిల్ చూపించాడు.

ఆలయ నిర్మాణంలో లోపభూయిష్టమైన వైరింగ్‌ను వినియోగించారని, దీని ద్వారా గురుద్వారాను ఎలా తగలబెట్టవచ్చో రాజ్‌గిల్ సదరు కిరాయి హంతకులకు సూచించాడని రాంఘీ ఆరోపించారు.గురుద్వారాలోని మైక్రోఫోన్‌ల సాయంతో క్యాప్చర్ చేసిన వీడియోలో కొంత భాగాన్ని ఆయన మీడియాకు చూపించాడు.







