బాబు స్పీడ్ కి బ్రేకులు : 'ఉచిత బస్సు ' ఇప్పట్లో లేనట్టేనా ? 

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలు అన్నిటిపైనా దృష్టి సారించింది.ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి.

 Troubles For Cm Chandrababu Implementing Free Bus Scheme Details, Tdp, Free Bus-TeluguStop.com

అయితే కొన్ని పథకాలు విషయంలో ఆర్థిక ఇబ్బందులు , చిన్న చిన్న లోటుపాట్లు , వాటి అమలుకు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి.ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం,  కొన్ని పథకాల అమలు విషయంలో తలెత్తే ఇబ్బందులు దృష్ట్యా, ఆయా పథకాల అమలు నిర్ణయాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం( Free Bus Journey ) విషయంలోనూ ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు( CM Chandrababu ) ప్రకటించారు.  కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని ఇప్పటి వరకు అమలు చేయలేదు.అయితే దీనికి కారణాలు చాలానే ఉన్నాయట.

Telugu Ap Financial, Ap Bus Scheme, Ap, Bus Scheme, Janasena, Karnatakabus-Polit

ఈ పథకం అమలులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడం,  ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న కర్ణాటక తెలంగాణలో అధ్యయనం చేసి వచ్చినా,  ఏపీ అధికారులు అందులోని లోటుపాట్లను చంద్రబాబుకు వివరించడంతో ఈ పథకం అమలుకు మరికొంత సమయం తీసుకుంటే మంచిదనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట .మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉందని అధికారుల అధ్యయనంలో తేలడంతో,  బాబు ఈ విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నారు.  దీనికి తోడు ఆటో డ్రైవర్ల( Auto Drivers ) నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తెస్తే సరిపడ బస్సులు లేకపోవడంతో,  ఆర్టిసి ప్రయాణం అస్థ వ్యస్తంగా మారుతుందని , ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొత్త బస్సులను కొనే పరిస్థితి లేకపోవడం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట.

Telugu Ap Financial, Ap Bus Scheme, Ap, Bus Scheme, Janasena, Karnatakabus-Polit

ఇప్పటికే కర్ణాటక,  తెలంగాణలో మహిళలకు బస్సు ఉచితం కావడంతో,  రాష్ట్రమంతా వారు ప్రయాణిస్తున్నారు .పురుషులు సీట్లు దొరుకక ఇబ్బందులు ఎదుర్కోవడం , ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను ప్రతినెల ఆర్టీసీకి చెల్లిస్తున్నారు .అదనపు బస్సులను కొనుగోలు చేసినా ఫలితం లేకపోవడం,  పురుషుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం,  అలాగే కర్ణాటకలోనూ ఉచిత బస్సు ప్రయాణంపై అక్కడి ప్రభుత్వం పునరాలోచనలో పడింది.  అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి సిద్ది రామయ్య చెప్పినప్పటికీ,  ఆర్థికంగా అక్కడ ప్రభుత్వానికి ఈ పథకం భారంగా మారడంతో సుదీర్ఘకాలం ఈ ఉచిత బస్సు ప్రయాణం కొనసాగించే అవకాశం కనిపించడం లేదు.ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న బాబు ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అప్పుడే ఈ పథకం అమలు జోలికి వెళ్ళకూడదనే ఆలోచనతో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube