సాధారణంగా కొందరు ఎప్పుడూ జాలీగా కనిపిస్తుంటారు.నవ్వుతూ తమ చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటారు.
కానీ కొందరు మాత్రం అలా కాదు.ఎప్పుడు చూడు కోపంగానే( Angry ) ఉంటారు.
ప్రతి చిన్న విషయానికి ఇతరులపై నోరేసుకుని పడిపోతూ ఉంటారు.మీరు కూడా చీటికిమాటికి కోపం తెచ్చుకుంటున్నారా.? అయితే అది చాలా ప్రమాదకరం.తన కోపం తనకు శత్రువు అని అంటూ ఉంటారు.
అది అక్షరాల సత్యం.తరచూ కోపానికి గురవడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు.
కోపం మీ హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు ను( Blood Pressure ) పెంచుతుంది.ఇది ఛాతీ నొప్పి, తల నొప్పి, అలసట, సైనస్ మరియు ఒత్తిడికి దారితీస్తుంది.
సుదీర్ఘమైన కోపం కండరాల ఒత్తిడి, జీర్ణకోశ బాధ మరియు ఇతర శారీరక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.
డిప్రెషన్ మరియు ఆందోళన యొక్క లక్షణాల్లో కోపం కూడా ఒకటి.మీరు ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నారు అంటే మీ మానసిక స్థితి ( Mental Condition ) సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి.ఆందోళనతో ఉన్న వ్యక్తులు మరియు డిప్రెషన్ కు గురైన వారు తమను తాము రక్షించుకోవడానికి కోపంతో వ్యవహరిస్తూ ఉంటారు.
అలాగే చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం వల్ల ఇతరులతో మీరు సరిగ్గా కలవలేరు.చుట్టూ ఉన్నవారు కూడా మీకు దూరంగా ఉంటారు.ఇది ఒంటరితనానికి దారితీస్తుంది.ఫలితంగా మానసిక క్షోభను అనుభవిస్తారు.నిరాశకు గురవుతుంటారు.
తరచూ కోపం తెచ్చుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ సైతం బలహీనపడుతుంది.
కోపం తెచ్చుకున్న ఆరు గంటల్లోపు శరీరంలో యాంటీబాడీస్ పరిమాణం తగ్గి వ్యాధి నిరోధక వ్యవస్థ కుంటుపడుతుంది.అలాగని కోపాన్ని పూర్తిగా అణచి వేసుకుంటే ఆయుష్షు తగ్గుతుంది.సో.కోపాన్ని అవసరం మేరకు మాత్రమే ఉపయోగించాలి.