మలబద్ధకం, పొట్ట సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

ఈ మధ్యకాలంలో చాలామందికి మలబద్ధకం సమస్య ఎక్కువైపోయింది.ఈ మలబద్ధకం ద్వారా చాలామంది తినే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు.

 Suffering From Constipation And Stomach Problems But Do This ,constipation ,stom-TeluguStop.com

అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే జంక్ ఫుడ్ అని చెప్పవచ్చు.జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఆహారంలో పీచు పదార్థాలు లేకపోవడం, అలాగే తక్కువ నీరు తాగడం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్లు తాగడం, లాంటి పనుల వల్లే మలబద్ధకం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక మరికొందరిలో ఇలాంటి సమస్యలు రావడానికి కారణం పైల్స్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు అని కూడా చెప్పవచ్చు.అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా కొన్ని ఇంటి నివారణలు కూడా పాటిస్తే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు తెలుపుతున్నారు.అయితే ప్రతిరోజూ పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం చాలా మంచిది.

Telugu Alcohol, Junk, Tips-Telugu Health Tips

అతి ముఖ్యంగా మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మద్యపానానికి దూరంగా ఉండటం చాలా మంచిది.అలాగే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ప్రతి రోజు ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను పుష్కలంగా తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.అదే విధంగా ప్రతిరోజు తాజాగా వండిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.అలాగే ఆహారాల్లో ఉడికించిన కూరగాయలు, తక్కువ మసాలాలు వాడితే శరీరానికి చాలా మంచిది.ఇక మలబద్ధకం నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే త్రిఫల చూర్ణం చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

Telugu Alcohol, Junk, Tips-Telugu Health Tips

ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మలబద్ధకంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ చూర్ణాన్ని రెండు పూటలు పాలలో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అదే విధంగా వేయించిన సోపును కూడా ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా తగ్గిపోతాయి.

అదే విధంగా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube