దేశంలో, అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలలో దీపావళి పండుగ వేడుకలు ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి.దీపావళి వేడుకలలో భాగంగా కొంతమంది రోడ్లపై వారికీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ పక్కవారిని కూడా అనేక ఇబ్బందులు పెడుతున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కొందరు యువకులు వారికి ఇష్టం వచ్చినట్లు బాణాసంచా కాలుస్తూ బైకులపై విచిత్ర విన్యాసాలు చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టడంతో… చివరికి అది కాస్త టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వద్దకు చేరింది.
దాంతో ఆయన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో పండగ పూట ఇదేం వికృతానందమని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.ఈ క్రమంలో సర్జనర్ ట్విట్టర్ లో ‘‘దీపావళి పండగ పూట ఇదేం వికృతానందం.ఎటు వెళ్తోందీ సమాజం.ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం దీపావళి.పండగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.
అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!?’’ అని ఆ యువకులకు సూటిగా ప్రశ్నించారు.ఇక సజ్జనార్ చేసిన పోస్ట్ కు పలువురు నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు.
ఇలాంటి యువకులకు తగిన బుద్ధి కచ్చితంగా చెప్పాల్సిందే అని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు ఆ యువకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.ఇక మరికొందరు అయితే తాత్కాలిక ఆనందం కోసం వారి జీవితాలతో పాటు పక్కవారి జీవితాలను కూడా చాలా రిస్క్ లో పెడుతున్నారని అంటున్నారు.