తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య…( Suriya ) ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వచ్చాయి.ముఖ్యంగా ఆయన హీరోగా నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా భారీ విజయాలను నమోదు చేసుకున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో సూర్య చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న కంగువ సినిమా( Kanguva Movie ) ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందు రానుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది.

కానీ సోలో రిలీజ్ కోసమే ఈ సినిమా ఇన్ని రోజులపాటు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అందుకోసమే ఈనెల 14వ తేదీన ఈ సినిమాని భారీ రేంజ్ లో రిలీజ్ చేసి పాన్ ఇండియా( Pan India ) లెవెల్లో భారీ సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే సూర్య కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెట్టుకున్నాడు.ఈ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ ఒక్క హీరో కూడా పాన్ ఇండియా లో సత్తా చాటడం లేదనే ఒక అపోహ కి తెరదించాలని చూస్తున్నాడు.

మరి సూర్య లాంటి స్టార్ హీరో వల్ల తమిళ్ సినిమా ఇండస్ట్రీ ఒక అడుగు ముందుకు వేస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక భారీ విజువల్స్ తో మైమరిపింప చేయడానికి ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఇక ప్రేక్షకులు అందరు ఈ సినిమా చూడడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది…
.